డబుల్ ఇంజిన్ సర్కార్‌కే జై - ఇంకా ఎక్కువ సీట్లొస్తాయ్..!!
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఉదయం 8 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం వరకు కొనసాగింది. 1వ తేదీన ముగిసిన తొలి విడత తరహాలోనే ఇవ్వాళ కూడా గుజరాత్ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. దీని ప్రభావం ఏ పార్టీ మీద ఉంటుందనేది 8వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపులో తేలిపోతుంది. గుజరాత్‌తో పాటు ఇప్పటికే పోలింగ్‌ను ముగించుకున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో కలిపి ఓట్లను లెక్కిస్తారు.

అన్ని సానుకూలమే..
పోలింగ్ ముగిసిన వెంటనే ఇక ఎగ్జిట్ ఫలితాలు వెల్లడి కావడం మొదలయ్యాయి. జాతీయ స్థాయిలో అన్ని మీడియా ఛానల్స్ ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెల్లడిస్తోన్నాయి. అన్ని ఫలితాలు కూడా భారతీయ జనత పార్టీకి అనుకూలంగా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లో గానీ, గుజరాత్‌లో గానీ బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంటుందని స్పష్టం చేస్తోన్నాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీకి నిరాశ తప్పదని స్పష్టం చెబుతోన్నాయి.

ఎగ్జిట్ పోల్స్ ముక్తకంఠం..
జన్ కీ బాత్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం- గుజరాత్‌లో బీజేపీ మరోసారి పాగా వేయడానికి సిద్ధమౌతోంది. ఇప్పుడున్న సీట్ల కంటే కూడా భారీ మెజారిటీని సాధించుకోబోతోంది. 182 స్థానాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీలో బీజేపీకి 117 నుంచి 140 స్థానాలు లభిస్తాయని జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్ పేర్కొంది. కాంగ్రెస్ మరోసారి ప్రతిపక్ష పాత్రకే పరిమితమౌతుందని, ఆ పార్టీకి 34 నుంచి 51 స్థానాలు లభించవచ్చని తెలిపింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ 6 నుంచి 13, ఇతరులు ఒకటి లేదా రెండు స్థానాల్లోనే విజయం సాధిస్తాయని తెలిపింది.

రాష్ట్ర అధ్యక్షుడి రియాక్షన్..
ఈ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై బీజేపీ గుజరాత్ అధ్యక్షుడు సీఆర్ పాటిల్ స్పందించారు. మరోసారి అధికారంలోకి రాబోతోన్నామని స్పష్టం చేశారు. ఫలితాలను తమకు అనుకూలంగా ఉంటాయని ముందు నుంచే అంచనా వేస్తూ వస్తోన్నామని స్పష్టం చేశారు. ప్రస్తుత అసెంబ్లీలో 99 స్థానాలు ఉండగా- దీనికి భిన్నంగా భారీ మెజారిటీని సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలో సుదీర్ఘకాలం పాటు అధికారంలో ఉంటాయని, డబుల్ ఇంజిన్ సర్కార్‌కు ప్రజలు పట్టం కట్టబోతోన్నారని అన్నారు.

టీవీలకు అతుక్కుపోయి..
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు సానుకూలంగా వెలువడటంతో అహ్మదాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద పార్టీ కార్యకర్తలు సందడి చేశారు. పార్టీ పతాకాలను పట్టుకుని పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. టీవీలకు అతుక్కుపోయారు. దాదాపుగా అన్ని ఎగ్జిట్ ఫలితాలు కూడా అనుకూలంగా వెలువడుతున్న కొద్దీ వారిలో జోష్ అధికమైంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌కు జిందాబాద్ కొట్టారు.
-
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications