చేతులు నరికేస్తాం, కళ్లు పీకేస్తాం: ఎంపీ వార్నింగ్

కోల్ కతా: పశ్చిమ బెంగాల్ లో తృణమల్ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే చేతులు నరికేస్తామని ఆ పార్టీ యూత్ విభాగం అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు అభిషేక్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అంతే కాకుండ తమ పాలనను తప్పు ప్పటిన వారికి తగిన బుద్ది చెబుతాం అంటు బహిరంగ సభలో హెచ్చరించారు.

ఎవరైనా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలనను తప్పుబడితే వారి కళ్లు పీకేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ. ఇతను తృణమల్ కాంగ్రెస్ యూత్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. పైగా ఎంపీ.

we will gouge their eyes out and throw them on the road

మమతా బెనర్జీ ప్రజల కోసం పాటుబడుతున్నారని, ఆమె నిత్యం ప్రజాసేవకు అంకితం అయ్యారని, అలాంటి మంచి మనిషి ప్రజల ప్రయోజనాలు కాపాడటానికి శక్తి వంచన లేకుండ పని చేస్తున్నారని కితాబు ఇచ్చారు. కొందరు తృణమల్ కాంగ్రెస్ వ్యతిరేకులు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.

అలాంటి వ్యక్తులు తమను, తమ పాలనను ధిక్కరిస్తే నడిరోడ్డు మీదకు లాక్కొని వచ్చి రెండు చేతులు నరికేస్తామని, కళ్లు పీకిపారేస్తామని వివిదాస్పద వాఖ్యలు చేశారు. అయితే ఈ విషయంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+