రేవంత్ పంపిన బిల్లు..! రిజర్వేషన్ల లిమిట్‌పై తేల్చేసిన రాహుల్
రిజర్వేషన్లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఏఐసీసీ సమావేశంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశ సమస్యలు తీర్చాలంటే.. దేశాన్ని ఎక్స్‌రే తీయాలన్నారు. దళితులు, ఆదివాసీల సమస్యలపై దృష్టి సారించాలన్నారు. వారి సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని రాహుల్ విమర్శించారు.
బీసీల రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిల్లు కేంద్రానికి పంపినా.. ఆ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రాహుల్ విమర్శించారు. తెలంగాణలో కులగణన విజయవంతంగా నిర్వహించారని తెలిపారు. కులగణన ఆధారంగా రిజర్వేషన్లు పెంచేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు.

కులగణన వల్ల దేశంలో బీసీల సంఖ్య ఎంతో తెలుస్తుందని రాహుల్ చెప్పారు. కులగణన విషయంలో తెలంగాణ దేశానికి మార్గం చూపిందన్నారు. రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి అంశాన్ని తొలగిస్తామన్నారు. తెలంగాణలో 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారని తెలిపారు. తెలంగాణ సంపదలో మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీలకు తగిన భాగస్వామ్యం లేదని, వారి జనాభాకు అనుగుణంగా సంపదలోనూ తగిన వాటా అవసరమని రాహుల్ చెప్పుకొచ్చారు.
మరోవైపు, కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ సర్కారు విక్రయిస్తోందన్నారు. ఇద్దరు వ్యాపారవేత్తలకే వాటిని అప్పగిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నాయని ఆరోపించారు. దేశంలో కులగణన చేపట్టాలని ప్రధాని మోడీని కోరినా తిరస్కరించారని అన్నారు. కులగణన అంటే మోడీకి ఎందుకంత భయమని ప్రశ్నించారు.
LIVE: Nyaypath - AICC Session | Ahmedabad, Gujarat https://t.co/8snXJNmtEM
— Rahul Gandhi (@RahulGandhi) April 9, 2025
దళితుడైన రాజస్థాన్ పీసీసీ నేతను ఆలయానికి వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. వక్ఫ్ సవరణ చట్టం మత స్వేచ్ఛపై దాడి అంటూ వ్యాఖ్యానించారు. ట్రంప్ తన స్నేహితుడని చెప్పుకుంటున్న మోడీకి.. టారిఫ్‌లతో భారత్‌పై దాడి చేస్తున్నా ప్రధాని చూస్తూ కూర్చొన్నారని మండిపడ్డారు. ట్రంప్ సుంకాలతో దేశ ఆర్థిక వ్యవస్థకు తీరని నష్టం జరుగుతుందన్నారు.












Click it and Unblock the Notifications