ప్రాణాలు తీసిన పొగమంచు: వాహనం నుజ్జునుజ్జు: 13 మంది దుర్మరణం: రహదారి రక్తసిక్తం
కోల్‌కత: తెల్లవారు జామున కురుస్తోన్న పొగమంచు.. రోడ్డు ప్రమాదాలకు కారణమౌతోంది. దట్టమైన మంచు తెరలు కమ్ముకున్నప్పటికీ.. వాహనదారులను నిర్లక్ష్యంగా వ్యవహరించడం వాటి తీవ్రత మరింత పెరగడానికి దారి తీస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో అర్ధరాత్రి సంభవించిన రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ఒకరిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. ఫలితంగా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు లేకపోలేదు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఈ ప్రమాదానికి పొగమంచు, డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. జల్‌పాయ్‌గురి జిల్లాలోని ధుప్‌గురిలో ఈ దుర్ఘటన సంభవించింది. జల్‌పాయ్‌గురి నుంచి అలీపూర్‌దౌర్ వైపు వెళ్తోన్న డబ్ల్యూబీ 72 ఆర్ 1688 నంబర్ గల వాహనం మార్గమధ్యలో ధుప్‌గురి వద్ద ప్రమాదానికి గురైంది. అదుపు తప్పి కంకర, బండరాళ్ల లోడుతో వెళ్తోన్న ఓ భారీ వాహనాన్ని వేగంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆ వాహనంలో ప్రయాణిస్తోన్న వారిలో 11 మంది అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ప్రమాద సమయంలో ఈ వాహనంలో 18 మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. ఢీ కొట్టిన వేగానికి బండరాళ్లు, కంకర.. ఆ వాహనంపై పడటంతో అది నుజ్జునుజ్జయింది. మృతదేహాలను వెలికి తీయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. గాయపడ్డ వారిని ధుప్‌గురి ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు. మిగిలిన వారిలో ఒకరిద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు డాక్టర్లు వెల్లడించారు. మెరుగైన చికిత్స కోసం జల్‌పాయ్‌గురికి తరలించినట్లు పేర్కొన్నారు.

దట్టమైన పొగమంచు వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మంచు తెరల వల్ల ఎదురుగా ఉన్న వాహనాల వేగాన్ని, దూరాన్ని డ్రైవర్లు అంచనా వేయలేకపోతోన్నారని, ఫలితంగా రోడ్డు ప్రమాదాల తీవ్రత పెరుగుతోందని అన్నారు. పొగమంచు కురుస్తోన్న సమయంలో వాహనాలను నెమ్మదిగా నడిపించాలంటూ జాతీయ రహదారుల వెంబడి ప్రచార కార్యక్రమాలు చేపట్టామని, మైక్‌ల ద్వారా ప్రకటనలను జారీ చేస్తన్నామని, టోల్‌గేట్ల వద్ద తరచూ తనిఖీలను నిర్వహిస్తుెన్నామని అయినప్పటికీ.. ఇలాంటి దుర్ఘటనలు సంభవిస్తున్నాయని పేర్కొన్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications