విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్, హత్య: దోషులుగా 6గురు

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కాందుని ప్రాంతంలో ఓ కళాశాల విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో అక్కడి కోర్టు ఆరుగురిని దోషులుగా నిర్ధారించింది. వారికి కోర్టు రేపు(శుక్రవారం) శిక్ష ఖరారు చేయనుంది.

కాగా, బుధవారం తీర్పు వెలువడడానికి ముందు కోల్‌కతాలో కోర్టు బయట ఆందోళనలు జరిగాయి. ఆందోళనకారులను పోలీసులు అదుపు చేశారు.

2013 జూన్‌లో కళాశాల నుంచి ఇంటికి వెళ్తున్న విద్యార్థిని(20)ని అపహరించి గ్రామ శివారులో నిర్మానుష్య ప్రాంతంలోని ఓ కర్మాగారం ఆవరణలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఆమెను హత్య చేశారు.

West Bengal: 6 of 8 accused in Kamduni gangrape, murder case found guilty

అదే రోజు రాత్రి సోదరిని వెదుకుతూ బయల్దేరిన సోదరుడు ఆమె మృతదేహాన్ని సమీపంలోని కాలువలో గుర్తించాడు. ఈ కేసు విషయంలో రాష్ట్రంలో గతంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.

కాగా, పోలీసులు 8 మందిపై అత్యాచారం, హత్య కేసులు నమోదు చేశారు. తొమ్మిదో నిందితుడు విచారణ సమయంలో జైల్లో అనుమానాస్పదంగా మరణించాడు. కేసు విచారించిన కోర్టు.. ఇప్పుడు వారిలో ఆరుగురిని దోషులుగా తేల్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+