Khela Hobe: మమతా బెనర్జీ ఒంటికాలితో ఫుట్‌బాల్..రీ‌సౌండ్ బెంగాల్

కోల్‌కత: దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు.. ఎవరు రాజు..ఎవరు బంటు అనేది తేల్చి పారేసింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలకు నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి ఒకింత చేదు అనుభవాన్నే మిగిల్చాయి. తమిళనాడులో అధికారాన్ని కోల్పోయింది. కేరళలో ఒకట్రెండు సీట్లు వచ్చినా గొప్పే అనిపించేలా ఉంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీకి గట్టి పోటీ ఇవ్వగలిగిందే తప్ప అధికార పీఠం నుంచి కదిలించలేకపోయింది. అస్సాంలో అధికారాన్ని నిలబెట్టుకుంది.

బెంగాల్ మీదే

బెంగాల్ మీదే

ఓట్ల లెక్కింపు సందర్భంగా అందరి కళ్లూ ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ మీదే నిలిచాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్‌ను ఓడించడానికి భారతీయ జనతాపార్టీ సర్వశక్తులనూ ఒడ్డటమే దీనికి కారణం. తృణమూల్ కాంగ్రెస్ వరుసగా రెండుసార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ.. ముఖ్యమంత్రిగా రెండుసార్లు ఆ రాష్ట్ర అధికార పగ్గాలను అందుకున్నారు. వరుసగా మూడోసారి కూడా జెండా ఎగరేేసే అవకాశాన్ని ఇవ్వకూడదంటూ బీజేపీ భావించింది. లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్‌తో సమానంగా సీట్లను సాధించుకున్న నేపథ్యంలో- ఈ సారి అధికారాన్ని అందుకోవడానికి శక్తివంచన లేకుండా పోరాడింది.

సీట్లు పెరిగాయే తప్ప..

సీట్లు పెరిగాయే తప్ప..

ఈ ఎన్నికల్లో బీజేపీ తన సీట్ల సంఖ్యను పెంచుకోగలిగిందే తప్ప మమతా బెనర్జీ ధాటికి ఎదురు నిలవలేకపోయింది. 211 స్థానాల్లో తృణమూల్ ఆధిక్యతలో కొనసాగుతోండగా.. బీజేపీ 78 స్థానాలకే పరిమితమైంది. వంద స్థానాలను కూడా అందుకోలేదంటూ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన అంచనాలు తప్పట్లేదు. బీజేపీని ఓడించడంలో మమతా బెనర్జీ పన్నిన వ్యూహాలు, అనుసరించిన గేమ్ ప్లాన్.. పక్కాగా అమలు కావడం వల్లే ఈ స్థాయి ఘన విజయాన్ని అందుకుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

ఖేలా హొబే అంటూ..

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తృణమూల్ కాంగ్రెస్ నినాదం ఒక్కటే.. ఖేలా హొబె (Khela Hobe). తృణమూల్ యంగ్ టర్క్ దేబాంగ్షు భట్టాచార్య రాసిన పాట ఇది. ఖేలా హొబె అంటే తెగించి ఆడు అని అర్థం. ఎన్నికల ప్రచారంలో ఈ పాటను యువరతం హోరెత్తించింది. ప్రత్యేకించి- మమతా బెనర్జీ గాయపడిన తరువాత.. ఈ పాట పీక్స్‌కు వెళ్లింది. కట్టు కట్టుకున్న కాలి పాదాన్ని ఫుట్‌బాల్‌పై ఉంచి, చీరను బిగించిన కార్టూన్లు పశ్చిమబెంగాల్ వ్యాప్తంగా గోడలపై వెలిశాయి. ఈ పాట.. ఆ కార్ట్యూన్ తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయాన్ని సాధించడంలో కీలకంగా మారాయి.

ఇప్పుడు తాజాగా.. మరోసారి

ఇప్పుడు తాజాగా.. మరోసారి

ఇప్పుడు తాజాగా ఆ పాట మరోసారి వినిపిస్తోంది. ఆ స్లోగన్ మళ్లీ రీసౌండ్ చేస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు లోక్‌సభ సభ్యురాలు నుస్రత్ జహాన్.. దీన్ని మళ్లీ తెరమీదికి తీసుకొచ్చారు. ఈ సారి కొద్దిగా మార్పులు చేశారు. జెటా హోచె..ఖేలా హొయెచె అనే నినాదాన్ని ఆమె వినిపిస్తున్నారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో ఖేలా హొబె పాటతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పండగ చేసుకుంటున్నారు. పార్టీ కార్యాలయాల ముందు సంబరాల్లో మునిగితేలుతున్నారు. మమతా బెనర్జీ మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని తేలడంతో వారి ఆనందానికి హద్దులు లేకుండా పోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+