ఫేస్‌బుక్ చూడొద్దనందుకు ఆత్మహత్య చేసుకొన్న బాలిక

Posted By:
Subscribe to Oneindia Telugu

కోల్‌కతా:ఫేస్‌బుక్ చూడవద్దని చెప్పినందుకు 11వ, తరగతి చదివే బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకొంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.

ప్రస్తుత కాలంలో సామాజిక మాధ్యమాలకు ఎంతో మంది పిల్లలు, యువత ఎంతగా బానిసలుగా మారిపోయారో ప్రత్యేకించి చెప్పన‌వ‌స‌రం లేదు. ఫేస్‌బుక్ వంటి మాధ్య‌మాలే త‌న లోకంగా బ‌తికేస్తున్నారు. బ‌య‌ట‌కు వెళ్లి ఆట‌లు ఆడ‌క‌పోవ‌డం, బంధువుల‌తో క‌లిసి మెల‌సి ఉండ‌లేక‌పోతుండ‌డంతో శారీర‌కంగానే కాకుండా మాన‌సికంగా కూడా దృఢంగా ఉండ‌లేక‌పోతున్నారు.

ఫేస్‌బుక్‌కి బానిస‌గా మారిన ఓ అమ్మాయి, అది వాడ‌కూడ‌దంటూ కుటుంబ స‌భ్యులు తిట్ట‌డంతో ఆత్మ‌హ‌త్య చేసుక‌న్న ఘ‌ట‌న కోల్‌కతాలోని హబ్రా పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

West Bengal: Class 11 Girl Ends Life After Being Scolded For Facebook Addiction

ఆ బాలిక‌ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసుకుని వివ‌రాలు తెలిపారు. ఆమె పదకొండో తరగతి చదువుతోంద‌ని, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బ‌లవ‌న్మ‌ర‌ణానికి పాల్పడిందని అన్నారు

. ఆమెకు స్మార్ట్‌ఫోన్ కొనిచ్చిన‌ప్ప‌టి నుంచి చదువుపై శ్రద్ధ వహించడం లేదు, కాలేజీకి కూడా వెళ్లట్లేద‌ని ఆమె తల్లి తెలిపింది. ఆహారం కూడా సరిగా తీసుకోవడం లేదని బాధపడింది.

ఆ అమ్మాయి ఇటీవ‌లే తన వాట్సప్ స్టేటస్‌లో ఐయామ్ డెడ్ అని పెట్టింది. తన జీవితంలో ఎన్నో కోల్పోతున్నానని ఫేస్‌బుక్‌లో రాసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A class 11 girl from West Bengal’s North 24 Parganas district committed suicide on Friday night after she was scolded by her elder brother for spending too much time on Facebook. The girl ended her life by hanging herself from the ceiling fan in her bedroom, informed the family members. The girl took this extreme step when she was alone on Friday evening as her family members had gone to a hospital to visit a relative.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి