Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

West bengal Election Results 2021 : ఆ సీటుపై అందరి ఫోకస్, మమతా వర్సెస్ సువేందు, ఎవరు గెలిచినా సంచలనమే!

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో దీదీ వర్సెస్ మోదీ హోరాహోరీగా సాగిన విషయం తెలిసిందే. ఈరోజు బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో అందరి దృష్టి ఆ నియోజకవర్గం పైనే కేంద్రీకృతమై ఉంది. దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలు ,కేంద్ర పాలిత ప్రాంతం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరగగా ఈరోజు అన్ని చోట్ల జరిగిన ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అయితే దేశం దృష్టి మాత్రం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని మమతా బెనర్జీ, టీఎంసీ కి షాక్ ఇచ్చి బిజెపిలో చేరి మమతకు పోటీ ఇచ్చిన సువేందు అధికారి బరిలోకి దిగిన నియోజకవర్గం నందిగ్రామ్ పైనే కేంద్రీకృతమై ఉంది.

నందిగ్రామ్ లో మమత వర్సెస్ సువేందు పోటీ

నందిగ్రామ్ లో మమత వర్సెస్ సువేందు పోటీ

నిన్న మొన్నటి వరకు మమతా బెనర్జీకి కుడిభుజంగా మెలిగిన వాడు,తాజాగా జరిగిన ఎన్నికలలో మమతాబెనర్జీతో తలపడ్డాడు.నందిగ్రామ్ లో మమత వర్సెస్ సువేందు పోటీ ఆసక్తికరంగా సాగింది.ఈరోజు ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఇక్కడ ఎవరు గెలిచినా సంచలనంగానే మారనుంది. ఇక్కడ ఇద్దరికీ 50-50 ఛాన్స్ ఉందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇద్దరు గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఇక్కడ మమతా బెనర్జీ గెలవకుంటే మాత్రం అది మమతకు భరించలేని షాక్ అవుతుందని చెప్పక తప్పదు.

నందిగ్రామ్ లో టీఎంసీలో చీలిక .. బీజేపీ నుండి బరిలోకి దిగిన సువేందు అధికారి

నందిగ్రామ్ లో టీఎంసీలో చీలిక .. బీజేపీ నుండి బరిలోకి దిగిన సువేందు అధికారి

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నందిగ్రామ్ కు ఎంతో ఆసక్తికరమైన చరిత్ర ఉంది .దశాబ్దాల తరబడి అక్కడ వామపక్ష పాలన సాగింది.వామపక్ష పాలనకు చరమగీతం పాడిన దీదీ తృణమూల్ కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. అప్పుడు నందిగ్రామ్ నియోజకవర్గం నుండి తృణమూల్ కాంగ్రెస్ తరపున సువేందు అధికారి విజయం సాధించారు.ఊహించని పరిణామాలు మధ్య సువేందు అధికారి బీజేపీలో చేరడంతో అక్కడ టీఎంసీ పార్టీలో చీలిక వచ్చింది.

Recommended Video

    Chris Gayle Expresses Gratitude To Pm Modi || Oneindia Telugu
    నందిగ్రామ్ లో ఎవరికి వారే హేమాహేమీలు .. ఎవరు గెలిచినా సంచలనమే

    నందిగ్రామ్ లో ఎవరికి వారే హేమాహేమీలు .. ఎవరు గెలిచినా సంచలనమే


    సువేందు అధికారి అనుచర గణం ఆయన వెంట బీజేపీలో చేరారు. అక్కడి ప్రజల్లో మమతా బెనర్జీ పై, అలాగే సువేందు అధికారిపై అంతే అభిమానం ఉంది. వారిద్దరిని తల్లి కొడుకులుగా భావిస్తారు నందిగ్రామ్ ప్రజలు. మొన్న ఎన్నికల్లో ఓట్లు వేసిన సందర్భంగా కూడా ఇదే విషయాన్ని పలువురు ప్రస్తావించారు.ఈ నేపథ్యంలో నందిగ్రామ్ ఫలితాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అక్కడ మమతాబెనర్జీ గెలిచినా, సువేందు అధికారి గెలిచినా సంచలనమే అవుతుంది. మరి ఈరోజు కౌంటింగ్ లో ఏం జరగబోతుంది అనేది తెలియాల్సి ఉంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+