Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కరోనా ఉన్నా పోటెత్తిన ఓటర్లు -బెంగాల్ 7వదశలోనూ భారీ పోలింగ్ -మధ్యాహ్నానికే 55% దాటి -ఈసీ అనూహ్యం

కరోనా మహమ్మారి రెండో దశ విలయం కొనసాగుతున్నా ప్రజాస్వామిక పండుగ యథావిథిగా కొనసాగుతున్నది. పశ్చిమ బెంగాల్ లో వైరస్ వ్యాప్తి తారా స్థాయికి చేరినా, అసెంబ్లీ ఎన్నికల ఏడో దశలోనూ పోలింగ్ భారీగానే నమోదవుతోంది. నేడు 34 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగుతున్నది. ఎన్నికల సంఘం అధికారిక లెక్కల ప్రకారం సోమవారం 1గంట సమయానికే 55.12శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల్లోపు ఇది ఈజీగా 70శాతానికిపైగా వెళ్లొచ్చనే అంచనాలున్నాయి.

Recommended Video

    TN Assembly Elections : Celebrities Voting సోషల్ మీడియాలో వైరల్ | Rajinikanth, Ajith, Vijay

    చెదురుమొదురు ఘ‌ట‌న‌లు మిన‌హా ప‌శ్చిమ‌బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల ఏడో దశ పోలింగ్ ప్ర‌శాంతంగా కొన‌సాగుతున్న‌ది. సీఎం మమత ఫొటో కలిగిన టోపీతో వచ్చిన టీఎంసీ ఎన్నికల ఏజెంట్ ను బీజేపీ అడ్డుకోవడం, మరోచోట బీజేపీ ఏంజెంటును మిగతా పార్టీలవాళ్లంతా కలిసి వెళ్లగొట్టడం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.

    West Bengal Elections 2021: 55.12% polling recorded till 2.45 pm, EC transfers more police officers

    పోల్ షెడ్యూల్ విడుదలైన రెండోరోజే బెంగాల్ డీజీపీని మార్చేసిన ఎన్నికల సంఘం చివరి దశలోనూ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. సోమవారం ఏడో దశ పోలింగ్ పూర్తయితే, చివరిదైన 8వ దశకు ఈనెల 29న పోలింగ్ జరుగనుంది. చివరి దశ పోలింగ్ జరుగనున్న జిల్లాల్లో డీఐజీ స్థాయి నుంచి కానిస్టేబుల్ దాకా పదుల సంఖ్యలో పోలీసులను ఈసీ బదిలీ చేసింది.

    కరోనా నేపథ్యంలో షెడ్యూల్ కుదించి, ఒకేరోజు పోలింగ్ పెట్టాలన్న బీజేపీయేతర పార్టీల వినతిని ఈసీ తోసిపుచ్చడంతో బెంగాల్ ఎన్నికలు యథావిథిగా జరుగుతున్నాయి. మే 2న ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను వెలువడనున్నాయి. బెంగాల్ లో ఏడోదశ పోలింగ్ కు ఓటర్లు పోటెత్తిన సందర్భంలోనే అటు మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశంలో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తికి, ప్రత్యేకించి తమిళనాడులో విపత్కర పరిస్థితికి ఎన్నికల కమిషనే కారణమని, ఇంత మంది చావులకు కారణమైన ఈసీపై హత్యానేరం కింద కేసుపెట్టాలంటూ మద్రాస్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+