West Bengal Exit Poll 2026: దీదీకి షాక్! దూసుకెళ్తున్న బీజేపీ..

పశ్చిమ బెంగాల్ ఎన్నికల క్లైమాక్స్ ఊహించని మలుపు తిరిగింది. 'చాణక్య స్ట్రాటజీస్' (Chanakya Strategies) విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ గణాంకాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య నరాలు తెగే ఉత్కంఠ నెలకొన్న వేళ.. ఈ సర్వే ఫలితాలు కాషాయ దళానికి ఊపిరి పోస్తున్నాయి.

పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు జరిగిన సమరంలో విజేత ఎవరో చాణక్య స్ట్రాటజీస్ తన ఎగ్జిట్ పోల్ ద్వారా కుండబద్దలు కొట్టింది. ఈ సర్వే అంచనాల ప్రకారం, గత దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి ఈసారి గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. 150 నుండి 160 స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా బీజేపీ బెంగాల్ గడ్డపై మొదటిసారి అధికార పీఠాన్ని అధిరోహించబోతోందని ఈ సర్వే స్పష్టం చేసింది. బెంగాల్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ (148)ను బీజేపీ సునాయాసంగా దాటేస్తుందని గణాంకాలు చెబుతున్నాయి.

West Bengal Exit Poll 2026 Chanakya Strategies Predicts BJP Victory with 150-160 Seats in Close Fight
West Bengal Exit Poll: ఇది కదా అసలైన ట్విస్ట్! బెంగాల్‌ టైగర్ ఎవరంటే!
West Bengal Exit Poll: ఇది కదా అసలైన ట్విస్ట్! బెంగాల్‌ టైగర్ ఎవరంటే!

హోరాహోరీగా తృణమూల్ పోరాటం,,

చాణక్య స్ట్రాటజీస్ అంచనా ప్రకారం, అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC+) గట్టి పోటీని ఇచ్చినప్పటికీ 130-140 స్థానాలకే పరిమితం కానుంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చరిష్మా పనిచేసినా.. అది అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సరిపోకపోవచ్చని ఈ అంచనాలు సూచిస్తున్నాయి. ఇక జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ (INC) కేవలం 2 నుండి 4 స్థానాలకే పరిమితం కాగా, ఇతర స్వతంత్రులు మరియు చిన్నాచితకా పార్టీలు 4 నుండి 6 సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని సర్వే పేర్కొంది.

Puducherry Exit Poll 2026: మళ్ళీ 'రంగ’నాథుడిదే హవా!
Puducherry Exit Poll 2026: మళ్ళీ 'రంగ’నాథుడిదే హవా!

నిర్ణయాత్మకంగా మారిన 'ఇతరులు',,

మొత్తం ఫలితాల్లో ఇతరులు, చిన్న పార్టీలకు (Others) 6 నుండి 10 స్థానాలు దక్కుతాయని ఈ సర్వే అంచనా వేసింది. ప్రధాన పార్టీల మధ్య పోటీ ఇంత తీవ్రంగా ఉన్నప్పుడు, ఈ కొన్ని స్థానాలు కూడా అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే, బీజేపీకి స్పష్టమైన మెజారిటీ దక్కుతుందని చాణక్య స్ట్రాటజీస్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+