Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సైలెంట్ హార్ట్ అటాక్స్ పెరిగిన వేళ- మరో డేంజరస్ వైరస్- మాస్కులు తప్పనిసరి..!!

పశ్చిమ బెంగాల్ లో అడినో వైరస్ విజృంభిస్తోంది. కొద్దిరోజుల వ్యవధిలోనే 19 మంది పిల్లలు దీని బారిన పడి మరణించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంది.

న్యూఢిల్లీ: దేశంలో సైలెంట్ హార్ట్ అటాక్స్ ఆందోళనకరంగా పెరిగాయి. గుండెపోటు సంభవించడం వల్ల ఉన్నచోటే ప్రాణాలను కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇలాంటి మరణాలు ఈ మధ్యకాలంలో చెప్పుకోదగ్గ సంఖ్యలో చోటు చేసుకున్నాయి. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్లే ఈ సైలెంట్ హార్ట్ ఎటాక్స్ సంభవిస్తోన్నాయనే వార్తలు వెలువడుతున్నాయి.

ఈ పరిణామాల మధ్య తాజాగా- మరో వైరస్ దాడికి దిగింది. దాని పేరు అడినో వైరస్. పశ్చిమ బెంగాల్ లో కలకలం రేపుతోందీ వైరస్. చిన్నపిల్లలను లక్ష్యంగా చేసుకుంది. అనూహ్యంగా వ్యాప్తి చెందుతోంది. అడినో వైరస్ బారిన పడి ఇప్పటికే అక్కడ 19 మంది పిల్లలు మృత్యువాత పడ్డారు. మరో 13 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారందరిలోనూ అడినో వైరస్ లక్షణాలు కనిపించినట్లు ప్రభుత్వం నిర్ధారించింది.

West Bengal government mandate wearing the mask for kids after the Adenovirus surge in the State

కరోనా వైరస్ ను పోలివుండే లక్షణాలు దీనికి ఉన్నాయి. వైరస్ సోకిన వెంటనే శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయి. రెండు సంవత్సరాల లోపు వయస్సున్న చిన్నారులపై దీని ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. న్యమోనియా సంబంధిత ఇబ్బందులకు ఈ వైరస్ కారణమౌతోందని తెలిపింది. పిల్లలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. దీని బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోండటం వల్ల- ఆసుపత్రులకు మరిన్ని మౌలిక వసతులను కల్పించింది ప్రభుత్వం. ప్రత్యేక వార్డులను అందుబాటులోకి తీసుకొచ్చింది.

జలుబు, జ్వరం, గొంతు నొప్పి, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు, ఉపిరితిత్తుల సమస్య, న్యుమోనియా వంటి లక్షణాలు రోగిలో కనిపిస్తాయని డాక్టర్లు తెలిపారు. మిగిలిన వారితో పోల్చుకుంటే- బలహీనమైన రోగనిరోధక శక్తి, శ్వాసకోశ లేదా గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వారికి ఈ వైరస్ అత్యంత వేగంగా సోకుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ వైరస్‌ ను నిర్మూలించడానికి ప్రస్తుతం ఎలాంటి మందులు లేవని తెలిపింది.

ఈ పరిణామాల మధ్య తాజాగా ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. చిన్న పిల్లలు మాస్కులను ధరించడాన్ని తప్పనిసరి చేసింది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటనను విడుదల చేశారు. బహిరంగ ప్రదేశాల్లో చిన్న పిల్లలు మాస్కులను ధరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ఎలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+