పంచాయితీ ఎన్నికల పంచాయితీలో 9 మంది హత్య, రాత్రికి ఏం జరుగుతుందో?
కోల్ కత్తా/పశ్చిమ బెంగాల్: ఎన్నికలు అంటేనే అన్ని పార్టీల నాయకులు వారి గెలుపుల కోసం దేనికైనా తెగిస్తారని తెలిసిన విషయమే. లోక్ సభ, శాసన సభ, జిల్లా పంచాయితీ, గ్రామ పంచాయితీ ఎన్నికలు ఇలా ఏ ఎన్నికలు అయినా సరే పలు పార్టీల కార్యకర్తలు ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం సర్వసాధారణం. ముఖ్యంగా గ్రామాల్లో జరిగే రాజకీయాలు ఎక్కడా జరగవు అని మరోసారి వెలుగు చూసింది.
పశ్చిమ బెంగాల్ లో తృణముల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) అధికారంలో ఉంది. తృణముల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మమతా బెనర్జి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్న విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న మమతా బెనర్జీ కేంద్రంలోని ప్రతిపక్ష పార్టీల నాయకులు అందరితో టచ్ లో ఉన్నారు.

శనివారం పశ్చిమ బెంగాల్ లో పంచాయితీ ఎన్నికల పోలింగ్ మొదలైయ్యింది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీతో పాటు కమ్యూనిస్టు పార్టీలు, బీజేపీ కూడా బలంగానే ఉంది. శనివారం ఉదయం ప్రశాంతంగా పంచాయితీ ఎన్నికలు మొదలు కావడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అయితే రానురాను పంచాయితీ ఎన్నికల పోలింగ్ ప్రతీకారాలకు దారితీసింది.
పంచాయితీ ఎన్నికల పోలింగ్ సందర్బంగా మొదట టీఎంసీ కార్యకర్త హత్యకు గురైనాడు. తరువాత టీఎంసీ కార్యకర్తలు ఐదు మంది హత్యకు గురైనారు. పంచాయితీ ఎన్నికలు ప్రతీకార హత్యలకు దారితీశాయి. బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల కార్యకర్తలతో పాటు మరో ఇండిపెండెంట్ అభ్యర్థి అనుచరుడు దారుణ హత్యకు గురైనారు.
పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల పోలింగ్ సందర్బంగా శనివారం మద్యాహ్నం వరకు 9 మంది పలు పార్టీల కార్యకర్తలు హత్యకు గురైనారు. ఇక సాయంత్రం ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు. పోలింగ్ పూర్తి అయిన తరువాత రాత్రి పూట గ్రామాల్లో ఏవైనా గొడవలు జరిగితే ఇంకా ఎంత మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో అంటూ పలు పార్టీల కార్యకర్తల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల సందర్బంగా ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఎంసీ పార్టీ నాయకులు, ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. పంచాయితీ ఎన్నికలకు కేంద్ర బలగాలు సహకరించలేదని, అందుకే మా పార్టీ కార్యకర్తలు హత్యకు గురి అవుతున్నారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కేంద్ర బలగాలకు సహకరించలేదని, అక్కడి టీఎంసీ ప్రభుత్వం ప్రతీకార చర్యలకు పాల్పడాలని సొంత పార్టీ కార్యకర్తలను పొట్టన పెట్టుకుంటున్నదని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications