Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తిరుమలలో ‘సంప్రదాయ భోజనం’ ప్రత్యేకతలు ఏమిటి, మెనూలో ఏమేం ఉంటున్నాయి

తిరుమల వెంకన్నను దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఉచిత భోజన సదుపాయం ప్రస్తుతం అందుబాటులో ఉంది. దీంతో పాటు టీటీడీ ఇప్పుడు కొత్తగా 'సంప్రదాయ భోజనాన్ని' భక్తులకు అందుబాటులోకి తెస్తోంది.

ఆగస్ట్ 26 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఈ సంప్రదాయ భోజనాన్ని ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తెచ్చి పరిశీలిస్తున్నారు.

తొలి రోజు భోజనం చేసినవారి నుంచి మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చిందని, రెండో రోజు (27.08.2021) టీటీడీ ఈవో కూడా ఈ భోజనాన్ని ఆరగించారని తితిదే అధికారులు చెప్పారు.

ఇంతకీ ఏమిటీ సంప్రదాయ భోజనం

పూర్తిగా దేశీయ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన ఆహార ఉత్పత్తులతో వండిన భోజనాన్నిభక్తులకు అందించాలని టీటీడీ నిర్ణయించింది.

దీన్నే 'సంప్రదాయ భోజనం' అని పిలుస్తున్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో ప్రస్తుతం ఇలాంటి భోజనాన్ని అందుబాటులో ఉంచుతున్నారు.

దేశీయ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ విధానంలో పండించిన పంటలతో వండిన ఆహార పదార్థాలు తినడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, కోవిడ్ సమయంలో శాస్త్రవేత్తలు కూడా ఇమ్యూనిటీ పెంచే ఆహారం గురించి చర్చిస్తున్నారని తితిదే ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి చెప్పారు.

''పట్టణ వాసులతో పోల్చితే గ్రామాల్లో సహజ సిద్ధమైన, కల్తీ లేని ఆహారం తీసుకునే వారిలో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఆహారం తీసుకోవాల్సి అవసరాన్ని చాటడం కోసం, గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి సంప్రదాయ భోజనాన్ని తిరుమలలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం'' అన్నారాయన.

లాభాపేక్ష లేకుండా శాశ్వత ప్రాతిపదికన దీన్ని అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

గోవు /cow

'పూర్తిగా దేశీయ గో ఆధారిత ఉత్పత్తులతోనే'

గోవిందుడికి గో ఆధారిత నైవేద్యం సమర్పించాలని టీటీడీ బోర్డు గతంలో తీర్మానించి అమలు చేస్తోంది. అందులో భాగంగా దేశీయ గోవుల ఆధారంగా సేంద్రియంగా పండించిన బియ్యం, పప్పు దినుసులు, బెల్లం, దేశీయ ఆవు నెయ్యితోనే నైవేద్యం సమర్పిస్తున్నారు.

అదే రీతిలో భక్తులకు కూడా గోఆధారిత వ్యవసాయ ఉత్పత్తులతో ఆహారం అందించాలనే ఉద్దేశంతో ఈ సంప్రదాయ భోజనాన్ని తీసుకొస్తున్నట్లు తితిదే పీఆర్‌వో పి.రవి 'బీబీసీ'తో చెప్పారు.

ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''తితిదే ఆద్వర్యంలో పలమనేరులో సుమారు 450 ఎకరాల్లో దేశీ గోశాల ఉంది. సేంద్రియ ఎరువులు, పంచగవ్య వంటివన్నీ ఈ గోశాల నుంచి ఉత్పత్తవుతాయి. దీంతో పాటు చిత్తూరు జిల్లా రైతులలోనూ ఈ దిశగా అవగాహన కల్పించేందుకు కూడా తితిదే ప్రయత్నిస్తోంది'' అని చెప్పారు.

తొలి రెండు రోజుల్లో...

గురువారం నుంచి ఈ ట్రయల్ రన్ మొదలు కాగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనాలలో వివిధ రకాల ఆహార పదార్థాలు వడ్డించారు.

కాలా బాత్ ఉప్మా, కుల్లకారు బియ్యం ఇడ్లీ.. రెడ్ రైస్‌తో వంటకాలు చేశారు. కొర్రలు, సామలు వంటి చిరుధాన్యాలతో వండిన పదార్థాలను వడ్డించారు. కొబ్బరి అన్నం, పులిహోర, పూర్ణాలు, పచ్చి పులుసు, దోశకాయ పప్పు వంటివి ఇప్పటికి 15 రకాలకు పైగా వంటకాలను భక్తులకు అందించారు.

భక్తుల నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందని అధికారులు చెప్పారు.

ఈ ట్రయల్ రన్‌లో తితిదేతో పాటు పనిచేస్తున్న చిరుధాన్యాల ఆహార నిపుణుడు రాంబాబు మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టులో భాగంగా దేశీయ ఆవు నెయ్యి, గానుగ నూనె, సేంద్రియ చెరకు పంట నుంచి తయారుచేసిన బెల్లంతో వంటలు వండుతున్నట్లు చెప్పారు.

ఉచిత భోజనం ఉన్నప్పటికీ...

తిరుమలలో చాలాకాలంగా భక్తులకు ఉచితం భోజన సదుపాయం ఉంది. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో నిత్యం పెద్ద ఎత్తున ఉచిత అన్నదానం జరుగుతుంది.

దీంతోపాటు 'సంప్రదాయ భోజనం' పేరుతో అన్నమయ్య భవనంలో అందుబాటులో తెచ్చేందుకు తితిదే కసరత్తు చేస్తోంది.

''వారం రోజుల ట్రయల్ రన్ తరువాత దీనిపై సమీక్షించుకుని బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. లాభాపేక్ష లేకుండా శాశ్వత ప్రాతిపదికన అమలు చేయడానికి విధివిధానాలు రూపకల్పన చేస్తారు'' అని పి.రవి చెప్పారు.

కాగా, అన్నమయ్య భవనంలో ఇంతకుముందు ప్రైవేట్ నిర్వహణలోని క్యాంటీన్ ఉండేది. ఆ కాంట్రాక్ట్ ముగియడంతో టీటీడీయే స్వయంగా ఇక్కడ భక్తులకు ఆహార శాల నిర్వహించాలనే ఆలోచన చేసింది. అందులో భాగంగానే సంప్రదాయ భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే తిరుమల భక్తులకు ఎలాంటి కల్తీ లేని బలవర్థక ఆహారం అందుతుందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+