నోట్ల రద్దుపై జైట్లీకి తెలిస్తే నాకు చెప్పేవారు: నరేష్, మోడీని నవ్వించిన మాయావతి

రాజ్యసభలో సీరియస్‌గా చర్చ జరుగుతున్న సమయంలో ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలు గట్టిగా నవ్వారు. అందుకు సమాజ్ వాది పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ కారణం.

న్యూఢిల్లీ: పార్లమెంటు ఉభయ సభలను నోట్ల రద్దు కుదిపేస్తోంది. ఈ అంశంపై రాజ్యసభలో గురువారం నాడు వాడిగా వేడిగా చర్చ జరిగింది. ఈ సమయంలో రాజ్యసభకు హాజరైన ప్రధానిని విపక్షాలు ఇరుకున పెట్టే ప్రయత్నం చేశాయి.

అంత వాడిగా, వేడిగా చర్చ జరుగుతున్న సమయంలోను సభలో నవ్వులు విరిశాయి. సీరియస్‌గా చర్చ జరుగుతున్న సమయంలో ప్రధాని మోడీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీలు గట్టిగా నవ్వారు. అందుకు సమాజ్ వాది పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ కారణం.

demonetisation

నరేష్ నోట్ల రద్దు పైన మాట్లాడుతూ.. ప్రధాని, ఆర్థిక మంత్రిలకు చురకలు అంటించారు. నోట్ల రద్దు విషయం అరుణ్ జైట్లీకి ముందు తెలిసి ఉండదని, ఆ విషయం ఆయనకు తెలిసి ఉంటే తనతో చెప్పేవాడని నరేష్ అగర్వాల్ అన్నారు. జైట్లీ తనకు బాగా తెలిసివారని, అందుకే తనకు చెప్పేవారన్నారు. ఈ వ్యాఖ్యలతో సభలో నవ్వులు విరిశాయి. యూపీలో బీజేపీకి భయం అక్కరలేదని, పాలించేది సమాజ్ వాది పార్టీనే అని అనడంతో ప్రధాని మోడీ మరోసారి నవ్వారు.

మాయావతి కూడా..

బీఎస్పీ సభ్యురాలు, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి లంచ్‌కు ముందు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ భోజన విరామం అనంతరం రాజ్యసభలో ఇలాగే డిబెట్‌లో కూర్చుంటారా అని ప్రశ్నించారు. దానికి మోడీ సమాధానం చెప్పలేదు. కానీ నవ్వేసి ఊరుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+