కులం, మతం పేరుతో చంపడం లేదే.. యూపీ కేరళ కామెంట్లపై యోగికి విజయన్ కౌంటర్

ఆలోచించి ఓటు వేయాలని.. లేదంటే యూపీ మరో కేరళ అవుతుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ కామెంట్ చేశారు. దీనిపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. కేరళ ఆదర్శ రాష్ట్రం అని చెప్పారు. అంతేకాదు కేరళను చూసి.. యోగి భయపడుతున్నారని కామెంట్ చేశారు. ఇక్కడ మంచి విద్య దొరుకుతుంది.. అనారోగ్యనికి గురయితే చికిత్స కూడా అందిస్తున్నామని తెలిపారు. కులం, మతం పేరుతో ప్రజలను చంపడం లేదే అని అడిగారు. రాష్ట్రంలో స్నేహపూర్వక వాతావరణం ఉందని.. మత సామరస్యం వెల్లివిరుస్తోందని అన్నారు. సామాజిక, ఆర్థిక భరోసా ఉంటుందని వివరించారు.

Recommended Video

    UP Elections 2022 : 'UP To Become Kashmir, Kerala & Bengal' - Yogi Adityanath | Oneindia Telugu

    రాష్ట్రాన్ని మరో కశ్మీర్, కేరళ.. లేదంటే బెంగాల్ చేయొద్దు అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఆయన ఇవాళ ఉదయం ఓ వీడియోను షేర్ చేశారు. మీరు తప్పు చేస్తే రాష్ట్రం రావణ కాష్టం అవుతుందని పరోక్షంగా ఆయన హెచ్చరించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంకితభావంతో పనిచేసిందని.. చేస్తోందని కామెంట్ చేశారు. గత ఐదేళ్లలో చాలా అద్భుతాలు జరిగాయని గుర్తుచేశారు. మరోసారి ఆలోచించుకోవాలని.. లేదంటే రాష్ట్రం కేరళగా మారొచ్చు అని కామెంట్ చేశారు. కార్మికులకు ఉపాధి కల్పించామని... అన్నీ రంగాల్లో రాష్ట్రం అభివృద్ది పథంలో కొనసాగుతుందని వివరించారు. గత ఐదేళ్లలో తాను చేసిన పనులు మీ ఆశీర్వాదం అని ఆయన అన్నారు. మీరు వేసే ఓటు నిర్భయంగా ఉండేందుకు గ్యారంటీ వంటిదని కామెంట్ చేశారు.

    What if UP becomes Kerala, asks Yogi Adityanath. Pinarayi Vijayan gives an answer

    తొలివిడతలో మొత్తం 11 జిల్లాల్లో గల 58 నియోజకవర్గాల ఓటింగ్ జరగనుంది. షామ్లీ, ముజప్ఫర్ నగర్, మీరఠ్, బాగ్‌పట్, ఘజియాబాద్, హాపుర్, గౌతమ్ బుద్ధ నగర్, బులంద్‌షహర్, అలీగఢ్, మథుర, ఆగ్రా జిల్లాల్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నిక జరుగుతుంది. యూపీలో మొత్తం 7 విడతలో పోలింగ్ జరగనుంది. మార్చి 10వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడుతారు. ఆ రోజు ఎవరూ రాజు తెలియనుంది. యూపీలో విజయం సాధిస్తే.. దేశంలో అధికారం చేపట్టడం ఖాయం అని బలంగా నమ్ముతారు. ఎందుకంటే ఇక్కడ 80 లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో బీజేపీకి బంపర్ మెజార్టీ వచ్చిన సంగతి తెలిసిందే.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+