Delhi Polls: ఢిల్లీ ఎన్నికలకూ, ఐటీ పరిమితి పెంపుకూ లింక్ ?

ఇవాళ ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ (union budget 2025)లో ఆదాయపు పన్ను (income tax) మినహాయింపు పరిమితిని ఏకంగా 12 లక్షలకు పెంచేశారు. దీంతో దేశవ్యాప్తంగా కోటి మందికి పైగా వేతన జీవులకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయిందని సాయంత్రం ఆర్దికమంత్రి ప్రెస్ మీట్లో వెల్లడించారు. అయితే కేంద్రం తీసుకున్న ఈ భారీ నిర్ణయం వెనుక ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి.

ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని 12 లక్షలకు పెంచుతూ ఆర్థికమంత్రి తీసుకున్న నిర్ణయం వెనుక ఉన్న రెండు కారణాల్లో ఒకటి ఆర్ధిక మందగమనంతో సతమతం అవుతున్న దేశంలో మధ్యతరగతి ఖర్చుపెట్టే సామర్ధ్యాన్ని పెంచడం అయితే రెండవది ప్రస్తుతం జరుగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, ఈ ఏడాది జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు. ఈ రెండు కారణాలతో ఐటీ పరిమితి పెరిగిందన్న విషయం బహిరంగ రహస్యమే.

what is link between income tax relief and delhi assembly elections

అయితే ఇప్పటికిప్పుడు కారణాన్ని చూస్తే మాత్రం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి కీలకంగా మారాయి. అధికార ఆప్ ను ఢీకొట్టి విజయం సాధించడం బీజేపీకి అంత సులువు కాదనేది ఇప్పటికే పలు సర్వేలు తేల్చేశాయి. ఇలాంటి పరిస్ధితుల్లో ఢిల్లీలో ప్రదాన ఓటు బ్యాంక్ అయిన మధ్యతరగతిని ఆకట్టుకునేందుకు ఏదో ఒకటి చేయాల్సిన పరిస్ధితి బీజేపీది. దీంతో ఆదాయపు పన్ను పరిమితిని అంతా ఊహించిన 10 లక్షలను మించి పోయి 12 లక్షలకు పెంచేసినట్లు తెలుస్తోంది. దీంతో ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న మధ్యతరగతి, ప్రధానంగా ఉద్యోగులకు ఊరట దక్కింది. అయితే ఈ నిర్ణయం ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి ఏ మేరకు మధ్యతరగతి ఓట్లను కురిపిస్తుందో మరో వారం రోజుల్లో తేలిపోనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+