ఆదిపురుష్ సినిమాపై ఏమిటీ వివాదం... సీత డైలాగ్‌పై అభ్యంతరం ఎందుకు?

'ఆదిపురుష్’ సినిమాలోని సీత పాత్రకు సంబంధించిన ఓ డైలాగ్ మీద నేపాల్‌లో వివాదం తలెత్తింది.
ఈ చిత్రంలో సీతను 'భారతదేశపు కుమార్తె'గా అభివర్ణించారు. దీనిపై నేపాల్ రాజధాని ఖాఠ్మండూ మేయర్ బాలేంద్ర షా అభ్యంతరం వ్యక్తం చేశారు.
చిత్ర నిర్మాతలు సినిమా నుంచి ఆ డైలాగ్‌ను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.
చిత్ర నిర్మాతలకు మూడు రోజుల సమయం ఇస్తున్నట్లు మేయర్ తెలిపారు. అంతేకాకుండా, ఇతర హిందీ చిత్రాలకు కూడా వార్నింగ్ ఇచ్చారు.
మరోవైపు సినిమాలోని అభ్యంతరకర సంభాషణలను నేపాల్ సెన్సార్ బోర్డ్ మ్యూట్ చేసిందని చిత్ర వర్గాలు బీబీసీకి తెలిపాయి.
సీత నేపాల్‌లోని జనక్‌పూర్‌లో జన్మించారని నేపాల్ వాదిస్తోంది. ఈ కారణంగానే ఈ సినిమాకు సంబంధించిన డైలాగ్‌పై నేపాల్‌లో వివాదం నెలకొంది.
ఆదిపురుష్‌లోని సీతను భారత పుత్రికగా అభివర్ణించే డైలాగ్‌ను తొలగించేంత వరకు ఖాఠ్మండూ మెట్రోపాలిటన్ సిటీలో ఏ ఇతర హిందీ సినిమాను కూడా అనుమతించబోమని బాలేంద్ర షా హెచ్చరించారు.

నేపాల్ సెన్సార్ బోర్డు ఏం చెప్పింది?
ఈ డైలాగ్‌పై నేపాల్ సెన్సార్ బోర్డు కూడా అభ్యంతరం వ్యక్తం చేసింది.
''బుధవారమే సినిమా చూశాం. డైలాగ్స్ కట్ చేసిన తర్వాతే ప్రదర్శనలకు అనుమతిస్తామని డిస్ట్రిబ్యూటర్లకు చెప్పాం'' అని బీబీసీతో నేపాల్ సెన్సార్ బోర్డు సభ్యుడు రిషిరాజ్ ఆచార్య తెలిపారు.
ఈ డైలాగ్ సినిమాలో బీప్ చేశారని కొందరు అంటుండగా నేపాల్‌లో ఈ పదాలను సినిమా నుంచి కత్తిరించినట్లు ఆచార్య చెప్పారు.
“కనీసం సినిమా కాపీల నుంచి ఆ తప్పు డైలాగ్‌ని తొలగించాలి. నేపాల్ కాపీలో మేం దానిని కత్తిరించాం." అని ఆయన అన్నారు.
నేపాల్‌లోనే కాకుండా ఇతర దేశాల్లోనూ తప్పులతో సినిమాను ప్రదర్శించడాన్ని సీరియస్‌గా తీసుకున్నట్లు ఫిల్మ్ డెవలప్‌మెంట్ బోర్డ్ తెలిపింది.
"జానకి భారతదేశం కుమార్తె అనే డైలాగ్‌పై మేం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం'' అని బోర్డు ప్రెసిడెంట్ భువన్ కేసీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
నేపాల్ స్వాతంత్య్రం, వారసత్వం, సరిహద్దులు మొదలైన సమస్యలపై లోపభూయిష్ట సన్నివేశాలు లేదా సంభాషణలను ప్రదర్శించే ప్రపంచంలోని ఏ చిత్రానికైనా ఫిల్మ్ డెవలప్‌మెంట్ బోర్డులు తన ముద్ర వేయడం ఆమోదయోగ్యం కాదని చెప్పారు.
ఈ నేపథ్యంలో సినిమాలోని వివాదాస్పద డైలాగ్‌ను తొలగించాలని సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను బోర్డు కోరింది.

'సినిమా ఆడించవద్దని సూచించాం'
మేయర్ హెచ్చరిక తర్వాత సోషల్ మీడియాలో తనకు చాలా బెదిరింపులు వచ్చాయని నేపాల్ ఫిల్మ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ భాస్కర్ దుంగనా చెప్పారు.
"భద్రతా కారణాల దృష్ట్యా ఉదయం ఖాఠ్మండూలో సినిమాను ఆడించవద్దని సూచించాం" అని బీబీసీ నేపాలీ సర్వీస్‌తో భాస్కర్ అన్నారు.
అయితే, ఖాఠ్మండూ లోయతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలలో ప్రదర్శనలు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కొనసాగాయని ఆయన పేర్కొన్నారు.
“వివాదాస్పద డైలాగ్‌ను తొలగించిన తర్వాత ఇకపై వాదించాల్సిన అవసరం కనిపించడం లేదు. సెన్సార్ బోర్డు ఇప్పటికే షోకు అనుమతి ఇచ్చింది’’ అని భాస్కర్ తెలిపారు.
గతంలో అక్షయ్‌కుమార్ చిత్రం 'చాందినీ చౌక్ టు చైనా'లో బుద్ధుడి గురించిన వివాదాస్పద డైలాగ్‌ను నేపాల్‌లో కట్ చేసి ప్రదర్శించారని ఆయన గుర్తుచేశారు.
ఇవి కూడా చదవండి
- తొలి సింథటిక్ మానవ పిండాన్ని తయారు చేసిన శాస్త్రవేత్తలు...ఇది నైతికమేనా?
- ఆంధ్రప్రదేశ్: కరెంటు బిల్లులో ఈ చార్జీలు ఏంటి... వీటిని ఎందుకు వసూలు చేస్తున్నారు?
- మధ్యధరా సముద్రంలో మునిగిన పడవ... 79 మంది మృతి, వందల మంది వలసదారులు గల్లంతు
- ఆంధ్రప్రదేశ్‌లో కరెంటు బిల్లుల మోత: గతంలో అద్దెకు ఉన్నవారు వాడిన విద్యుత్‌కు ఇప్పుడు మీతో ప్రభుత్వం బిల్లు కట్టించుకుంటోందా?
- ఓలా, ఉబర్: రైడ్‌ను డ్రైవర్ క్యాన్సిల్ చేసినప్పుడు ఏం చేయాలి?
( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
-
భద్రాద్రి రాముడి గోత్రం ఏంటి? మీకు తెలుసా? -
భద్రాద్రి రాముడికి మహర్దశ: ఆలయ అభివృద్ధికి రూ.351 కోట్లు విడుదల! -
‘అభిజిత్’ లగ్నం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications