ప్రధాని మోడీతో ఒబామా విందు: ఏం తిన్నారు....?
న్యూఢిల్లీ: తన మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రధాని మోడీ ఆదివారం మధ్యాహ్నాం విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో అధ్యక్షుడు ఒబామా, మోడీ కలసి భోజనం చేశారు. స్వతహాగా శాకాహారి అయిన ప్రధాని మోడీ, ఒబామా కోసం ప్రత్యేకంగా భారతీయ వంటకాలు అందులోనూ పూర్తిగా శాకహార వంటకాలతో విందు ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
ఈ విందులో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఏం తిన్నారనేది ఆసక్తిగా మారింది. మెనులో షట్వార్ కా షోర్బా, అనానస్ ఔర్ పనీర్ కా సూలా, నడ్రు కే గూలర్, మటర్ పలావ్, గుజరాతీ కడీ, మిక్స్ డ్ వెజిటబుల్ కలోంజి, కెలా మేథీ ను షాక్, పనీర్ లబబ్దార్, గాజర్ కా హల్వా, గులాబ్ జామూన్, పండ్లను చేర్చారు.
Lunch time. Here is what PM @narendramodi & Prez @BarackObama are having for lunch. pic.twitter.com/N9D4TIsqol
— Syed Akbaruddin (@MEAIndia) January 25, 2015 మోడీతో పాటు ఒబామా కూడా పూర్తిగా శాకాహార భోజనాన్నే తిన్నట్లు తెలుస్తోంది. ఐతే ప్రత్యేకించి ఏయే పదార్ధాలను తిన్నారనేది మాత్రం బయటకు తెలియరాలేదు. ఇది ఇలా ఉంటే ఆదివారం రాత్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇచ్చే అధికారిక విందులో శాకాహారంతో పాటు మాంసాహారం కూడా ఉంది. మటన్ రోగన్ జోష్, గలౌటీ కబాబ్, పనీర్ మలై టిక్కా మెనూలో ఉన్నాయి.

అమెరికా అధ్యక్షుడు ఒబామా గౌరవార్ధం ఆదివారం రాత్రి రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో 250 మంది ప్రముఖులను ఈ విందుకు ఆహ్వానించారు. కేవలం రాజకీయ నేతలు, కార్పోరేట్ దిగ్గజాలు మాత్రమే ఈ విందులో పాల్గొనున్నారు.
నోబెల్ అవార్డు గ్రహీత కైలాశ్ సత్యార్థి, సరోద్ విద్యాంసుడు అమ్జందాద్ అలీ ఖాన్, పర్యావరణవేత్త ఆర్కే పచౌరీలతో పాటు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ తదితరులను విందుకు ఆహ్వానించారు.
ఇక కార్పొరేట్ దిగ్గజాల్లో రతన్ టాటా, గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, నారాయణమూర్తి, చందా కొచ్చర్, ప్రతాప్ రెడ్డి విందుకు హాజరయ్యే వారి జాబితాలో ఉన్నారు.












Click it and Unblock the Notifications