యూజర్ల కష్టాలకు చెక్: కొత్త ఫీచర్ తీసుకొచ్చిన వాట్సాప్

హైదరాబాద్: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ తన వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో చాలా మంది వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యకు చెక్ పెట్టింది. మొబైల్ నెంబర్‌ను సేవ్ చేయకపోయినా.. ఇతర వ్యక్తికి మెసేజ్ చేసేందుకు అవకాశం కల్పించింది.

ఈ ఫీచర్ ఐఓఎస్ తోపాటు ఆండ్రాయిడ్ వినియోగదారులు కొందరికి అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇంతకుముందు కాంటాక్ట్ నెంబర్ సేవ్ చేసుకుంటేనే మెసేజ్ పంపే అవకాశం ఉన్న విషయం తెలిసిందే. తాజా ఫీచర్‌తో ఇకపై ఆ అవసరం లేకుండా పోయింది.

WhatsApp rolls out new feature to chat with unknown phone numbers

ఈ ఫీచర్ కోసం ఏం చేయాలంటే..?

వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేసి తర్వాత స్మార్ట్ న్యూ చాట్ బటన్‌ పై క్లిక్ చేయాలి.
ఏ నెంబర్‌కు మెసేజ్ చేయాలనుకున్నామో.. ఆ ఫోన్ నెంబర్‌ను సెర్చ్ బార్‌లో ఎంటర్ చేయాలి.
వాట్సాప్ ఆ నెంబర్‌ను సెర్చ్ చేసి సంబంధిత వ్యక్తికి మెసేజ్ చేసేలా ఆప్షన్‌ను ఎనేబుల్ చేస్తుంది.
కాగా, ఈ ఫీచర్ గురించి వాట్సాప్ ఇంత వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. వాబీటా ఇన్ఫో ఈ విషయాన్ని తెలియజేసింది.

ప్లే స్టోర్‌లో గానీ, యాప్ స్టోర్‌లో వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకుని ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చింది లేదో చెక్ చేసుకోవచ్చు. కాగా, ఇప్పటికే పలు కొత్త ఫీచర్లను వాట్సాప్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. యూజర్లు ఎవరికీ వారు తమ వాట్సాప్‌కి మెసేజ్ పంపుకునే అవకాశాన్ని ఇటీవల కల్పించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+