షాకింగ్: రెండు గంటల పాటు దారితప్పిన గరీబ్‌రథ్ రైలు, ప్రమాదం తప్పింది
లక్నో: పంజాబ్‌లోని అమృత్‌సర్ నుంచి బీహార్‌లోని సహర్స వెళ్లాల్సిన గరీభ్ రథ్ రైలు రెండు గంటల పాటు తప్పిపోయింది! సహర్స వెళ్లాల్సిన రైలు మరో చోటుకు వెళ్లింది.
షెడ్యూల్ ప్రకారం యూపీలోని మొరదాబాద్‌కు చేరుకోవాల్సిన రైలు ఘజియాబాద్ జంక్షన్ నుంచి అలీగఢ్ వైపు దారి మళ్లింది. రైలు డ్రైవర్ ఈ విషయాన్ని గమనించుకోకుండా సుమారు గంటన్నర పాటు అలాగే వెళ్లిపోయాడు. ఆ తర్వాత దారి తప్పిన విషయాన్ని గుర్తించాడు. వెంటనే రైలును ఆపేశాడు.

అధికారులకు విషయం చెప్పాడు. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మళ్లీ రైలు ఘజియాబాద్ స్టేషన్‌కు రప్పించారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. రైలు దారి తప్పిన సమయంలో అటువైపుగా ఏ రైలు రాకపోవడంతో ప్రమాదం తప్పింది.












Click it and Unblock the Notifications