సిజెఐ ముందు కంట తడిపెట్టిన జస్టిస్ అరుణ్ మిశ్రా

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా వద్ద జరిగిన న్యాయమూర్తుల ఇష్టాగోష్ఠి సమావేశంలో ఉద్విగ్న సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీపక్ మిశ్రా ఎదుట జస్టిస్ అరుణ మిశ్రా కంట తడి పెట్టుకున్నారు.

అరుణ్ మిశ్రా జస్టిస్ లోయా కేసును విచారిస్తున్నారు. లోయ మృతి కేసులో తనను అసంతృప్త న్యాయమూర్తులు నలుగురు అనవసరంగా లక్ష్యం చేసుకున్నారని, తతన చిత్తశుద్ధిని శంకించారనే విషయం మాత్రం అర్థమైందని ఆయన అన్నారు.

When SC judge hearing Justice Loya case broke down in front of CJI

అసంతృప్త న్యాయమూర్తులు నేరుగా అరుణ్ మిశ్రా పేరును ప్రస్తావించికపోయినప్పటికీ జస్టిస్ లోయా మృతి కేసుపై అనుమానాలు వ్యక్తం చేశారు. తాను ఎంతో శ్రమిస్తున్నానని, తనపై పనిభారం కూడా చాలా ఉందని అరుణ్ మిశ్రా అన్నారు.

గతంలంో పనిచేసిన ప్రధాన న్యాయమూర్తులు టిఎస్ ఠాకూర్, జెఎస్ ఖేహర్ తనకు ఎన్నో క్లిష్టమైన కేసులను అప్పగించారని అన్నారు.అరుణ్ మిశ్రా కంట తడి పెట్టడంతో దీపక్ మిశ్రా ఆయనను తన గదికి తీసుకుని వెల్లారు. అక్కడే ఉన్న జస్టిస్ జాస్తి చలమేశ్వర్ కూడా ఆయన ఓదార్చే ప్రయత్నం చేశారు.

తాము సుప్రీంకోర్టులోని పలు అంశాలను లేవనెత్తామే తప్ప ఎవరకీ వ్యతిరేకం కాదని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+