వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రికార్డులు బద్దలు కొట్టారంటూ ప్రధాని మోడీ: హిమాచల్ ఫలితాలపై కీలక వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గుజరాత్ ఫలితాలు భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలు ఉన్నారని మరోసారి నిరూపించాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రజల ఆశీర్వాదం ఉంటే అద్భుతాలు జరుగుతాయనడానికి ఈ ఫలితాలే నిదర్శనమిన అన్నారు. ప్రజల ఆశీర్వాదంతోనే గత రికార్డులు తిరగరాస్తూ బీజేపీ విజయం సాధించిందన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి మోడీ పాల్గొన్నారు.

రికార్డులు బ్రేక్ చేశారంటూ ప్రధాని మోడీ అభినందనలు

రికార్డులు బ్రేక్ చేశారంటూ ప్రధాని మోడీ అభినందనలు

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. గుజరాత్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్టీ కార్యకర్తల శ్రమకు తగిన ఫలితం లభించిందన్నారు. గుజరాత్ ప్రజలు అన్ని రికార్డులూ బ్రేక్ చేశారని అభినందించారు. కొత్త ఆకాంక్షలకు ప్రతిరూపమే ఈ తీర్పు అని అన్నారు. ఈ విజయాలు పెద్ద కఠిన నిర్ణయాలకు నాంది పలుకుతాయన్నారు. భూపేంద్ర-నరేంద్ర నెలకొల్పిన రికార్డులను ప్రజలు బద్దలు కొట్టారు. సీఎం భూపేంద్ర పటేల్ 2 లక్షల మెజార్టీతో గెలిచారు. ఇలాంటి మెజార్టీ ఎంపీ ఎన్నికల్లోనూ సాధ్యం కాదన్నారు. బీజేపీ ఈ స్థాయి రావడానికి తరతరాల కృషి ఉందన్నారు. పేదల కోసం ఎన్నో పథకాలు తెచ్చామన్నారు. పరిపాలన ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలా చేస్తున్నామన్నారు ప్రధాని మోడీ.

హిమాచల్‌ప్రదేశ్ ఫలితాలపై మోడీ కీలక వ్యాఖ్యలు

హిమాచల్‌ప్రదేశ్ ఫలితాలపై మోడీ కీలక వ్యాఖ్యలు

కోటిమందికిపైగా యువత బీజేపీకి ఓటేశారన్నారు. బీజేపీ పనితీరుకు యువత జైకొట్టిందన్నారు ప్రధాని మోడీ. కుల వాదం, కుటుంబవాదానికి యువత లొంగిపోలేదన్నారు. కుల, మతాలకు అతీతంగా బీజేపీకి ఓటేశారన్నారు. యూపీ రాంపూర్‌లో బీజేపీ విజయం సాధించిందన్నారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో ఒక్కశాతం కంటే తక్కువ ఓట్లతో గెలుపోటములు జరిగాయన్నారు. ఇంత తక్కువ ఓట్ల శాతంతో గతంలో గెలుపోటములు ఎప్పుడూ జరగలేదన్నారు. బీహార్ ఉపఎన్నికలోనూ ప్రజలు బీజేపీకే పట్టం కట్టారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇది బీజేపీకి మంచి సూచన అని అన్నారు.

ఏ సవాలు ఎదురైనా దేశ ప్రజలు బీజేపీవైపేనంటూ మోడీ


ఇండియా ఫస్ట్ అనేది తమ నినాదమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. దేశంలో పేదరికం తగ్గుతోందని నిపుణలు చెబుతున్నారన్నారు. మా ప్రతి నిర్ణయం వెనుక సుదూర లక్ష్యం ఉంటుంది. పేదరికాన్ని పారద్రోలేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం. విద్వేషాలు రెచ్చగొడితే తాత్కాలిక ప్రయోజనాలే ఉంటాయి. విజయానికి షార్ట్ కట్ లు ఉండవని స్పష్టం చేశారు ప్రధాని మోడీ. దేశానికి ఎప్పుడు ఏ సవాల్ ఎదురైనా.. ప్రజల నమ్మం బీజేపీపైనే ఉందని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు.

70 ఏళ్లలో చేయలేనిది 8 ఏళ్లలో చేసిచూపించామన్న మోడీ

గుజరాత్ ఎన్నికల్లో ఆదివాసీలు బీజేపీకి అండగా నిలిచారన్నారు ప్రధాని. ఆదివాసీల అభివృద్ధి కోసం పనిచేస్తున్నందునే వారు తమకు మద్దతు పలికారని తెలిపారు. 40 చోట్లలో 34 స్థానాల్లో బీజేపీని గెలిపించారని చెప్పారు. తొలి ఆదివాసీ రాష్ట్రపతిని తీసుకొచ్చిన ఘనత బీజేపీదేనని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. పెద్ద ఎత్తున మహిళలు బీజేపీని ఆదరించారన్నారు. మహిళలకు బీజేపీ ఎప్పుడూ అండగా నిలుస్తుందన్నారు. మహిళల సాధికారత కోసం 70 ఏళ్లలో జరగనిది 8ఏళ్లలో చేసి చూపించామన్నారు. దేశ ప్రయోజనాల కోసీం బీజేపీతో కలిసి రావాలని ప్రజలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. సబ్ కా సాత్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్ తోపాటు సబ్ కా ప్రయాస్ నినాదంతో పనిచేయాలన్నారు. మరింత అభివృద్ధి పథంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.

English summary
whenever there is a challenge before the country, people show their faith in BJP: Prime Minister Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X