కర్ణాటకలో బీజేపీ నయా స్కెచ్- ఈ అయిదేళ్లూ అధికార పార్టీకి దినదినగండమే

బెంగళూరు: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి పదవిపై ఏర్పడిన ప్రతిష్ఠంభనకు ఎట్టకేలకు తెరపడింది. దేశ రాజధాని వేదికగా మూడు రోజులపాటు ఉత్కంఠభరితంగా సాగిన కర్ణాటక రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తెర దించింది. ఇద్దరు ఉద్దండులు సిద్ధరామయ్య- డికే శివకుమార్ లల్లో ఎవరిని ముఖ్యమంత్రిగా అపాయింట్ చేయాలనే విషయంపై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుంది. సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది.

ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘోర పరాజయాన్ని చవి చూసిన విషయం తెలిసిందే. 66 స్థానాలకే పరిమితమైంది. బీజేపీకి దక్కిన ఓట్ల శాతం 35.8. బసవరాజ్ బొమ్మై కేబినెట్‌లో పని చేసిన 11 మంది మంత్రులు పరాజయం పాలయ్యారు. కాంగ్రెస్ పార్టీ దూకుడు ముందు బీ శ్రీరాములు, కే సుధాకర్, వీ సోమణ్న వంటి హేమాహేమీలు సైతం మట్టికరిచారు.

'

congress-bjp

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఎన్నికల ప్రచారం, బహిరంగ సభల్లో పాల్గొన్న నియోజకవర్గాల్లోనూ బీజేపీ అభ్యర్థులకు పరాజయం తప్పలేదు. ఈ ఓటమిని విశ్లేషించుకుంటోంది బీజేపీ అధిష్ఠానం. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంటోంది. మళ్లీ కమల వికాసం కోసం చేపట్టాల్సిన అనుసరించాల్సిన వ్యూహాలపై కసరత్తు చేస్తోంది. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను పోషిస్తామంటూ బొమ్మై ఇదివరకే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

కాగా- మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో అనుసరించిన వ్యూహాలను కర్ణాటకలో అమలు చేయాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా తొలుత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, ఆ తరువాత బీజేపీ చేపట్టిన ఆపరేషన్ లోటస్ వల్ల కుప్పకూలిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ సారథ్యంలో, మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ- పూర్తికాలం పాటు మనుగడ సాగించలేకపోయింది కాంగ్రెస్. ఆపరేషన్ లోటస్ దెబ్బకు కుదేల్ అయింది.

ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ ఉండటంతో రూటు మార్చింది బీజేపీ. అయిదేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి కంటిమీద కునుకు లేకుండా చేసేలా యాక్షన్ ప్లాన్‌ను అమలు చేయవచ్చు. దీనికోసం ఎలాంటి నిర్ణయాలనైనా తీసుకునే అవకాశాలు లేకపోలేదు బీజేపీ. ఆ ఉద్దేశంతోనే 1986 బ్యాచ్, కర్ణాటక కేడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్‌‌ను అత్యంత కీలకమైన సీబీఐ డైరెక్టర్‌గా నియమించిందనే అభిప్రాయాలు ఉన్నాయి.

గతంలో మధ్యప్రదేశ్‌లో ఓడిపోయినప్పుడు ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి రిషి శుక్లాను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సీబీఐ డైరెక్టర్‌గా నియమించిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే సారథ్యంలో మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు కూడా అదే ఫార్ములాను అమలు చేసింది. మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సుబోధ్ జైస్వాల్‌ను సీబీఐ చీఫ్‌గా నియమించింది. ఆ రెండు చోట్ల కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో లేదు.

congress-bjp

ఇప్పుడు తాజాగా కర్ణాటక కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, పోలీస్ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ సూద్‌‌ను సీబీఐ డైరెక్టర్‌గా నియమించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎక్కడైతే బీజేపీ ఓడిందో అక్కడి నుంచి సీనియర్ ఐపీఎస్ అధికారిని సీబీఐ డైరెక్టర్‌గా కొనసాగించడంపై విమర్శలు వ్యక్తమౌతోన్నప్పటికీ.. ఏ మాత్రం పట్టించుకోవట్లేదు. వాటిని బేఖాతర్ చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+