వాజ్‌పాయ్ సంధించిన ఆ ఒక్క డైలాగ్‌ లాలూ కోటను కూల్చేసింది..!!

బీహార్ ఎన్నికల్లో మహాకూటమికి బొమ్మ కనిపించింది. దెబ్బ కొడితే మరో పదేళ్లు కోలుకోకూడదు అన్నట్లుగా మోదీ అండ్ టీమ్ చాలా ఫోకస్డ్‌గా శ్రద్ధగా కొట్టారు. "ఎవడైనా చెప్పి కొడతారు లేదా దొంగ దెబ్బ వేస్తారు. కానీ వీడేంట్రా చాలా శ్రద్ధగా బలంగా కొట్టాడు" అని అదేదో సినిమాలో తనికెళ్ల భరణి చెప్పే డైలాగు బీహార్ ఫలితాలను చూస్తే గుర్తుకొస్తోంది. అయితే గతంలో 1990 నుంచి 2005 వరకు కొనసాగిన లాలూ ప్రసాద్ యాదవ్ పాలనకు ఒకే ఒక్క డైలాగ్‌తో బ్రేక్ పడింది. ఇక అప్పటి నుంచి ఆర్జేడీ అధికారం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తోంది. ఇంతకీ ఆ డైలాగ్ ఏంటి..? ఎవరు చెప్పారు..?

లాలూ చక్రవ్యూహానికి చెక్...
అది 2005వ సంవత్సరం. బీహార్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిన సంవత్సరం. అప్పటి వరకు లాలూ 15ఏళ్ల పాలనలో బీహారీలు నరకయాతన అనుభవించారు. బయటకు అడుగుపెడితే సాయంత్రం భర్త ఇంటికి వస్తాడో లేదో తెలియని రోజులు. బడికెళ్లిన పిల్లలు క్షేమంగా వస్తారో రారో అని తల్లిదండ్రులు ఎధురు చూసిన రోజులవి. బీహార్ రాష్ట్రంలో కిడ్నాపులు, దందాలు, దాదాగిరీ పేట్రేగిపోయిన రోజులు. ఫిర్యాదు చేద్దామని పోలీసు స్టేషన్‌కు వెళితే పోలీసులది ప్రేక్షకుల పాత్రగానే మిగిలిపోయేది. ఇక అన్యాయానికి గురైన వారికి న్యాయం జరుగుతుందనే ఆశ సన్నగిల్లిపోయింది. అప్పుడే ఆ రాష్ట్రానికి ఎన్నికలు వచ్చాయి.. ప్రతీసారీ ఎన్నికలు వచ్చినప్పటికీ అక్కడ సొంతంగా ఓటు వేసే స్వేచ్ఛ అక్కడి ఓటరుకు చాలా తక్కువగా ఉండేది. కానీ ఆ రాష్ట్ర స్థితిగతులను మార్చే టార్చ్ బేరర్‌లా ఒకే ఒక వ్యక్తి నిలిచాడు. ఆయనే దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పాయ్.లాలూ చక్రవ్యూహానికి చెక్ పెట్టారు.

where-is-my-kislay-the-one-dialogue-that-dethroned-lalu-prasad-yadavs-jungle-raj-in-bihar-2005

ఆ రోజుల్లో బిహార్ రాష్ట్రంలో కిడ్నాపులు ఎక్కువగా జరిగేవి. చిన్నపిల్లల నుంచి పండు ముదసలి వరకు కిడ్నాపుల సంఖ్య కోకొల్లు.గోలు అనే చిన్నారిని ముజఫర్‌‌పూర్‌లో కిడ్నాప్ చేయగా,పాట్నాలో శ్వేతా అనే అమ్మాయి అపహరణకు గురైంది.అదే పాట్నాలోని గోలా రోడ్‌లో 14 ఏళ్ల కిస్లే అనే బాలుడు కిడ్నాప్‌ అవడంతో వార్తా పత్రికల్లో ప్రధాన హెడ్‌లైన్స్‌గా నిలిచింది.అప్పటికే అక్కడ అసెంబ్లీ ఎన్నికల వాతావరణం నెలకొంది. అప్పుడే ఎన్నికల ప్రచారానికి దివంగత మాజీ ప్రధాని వాజ్‌పాయ్ వచ్చారు. కిస్లే కిడ్నాప్ గురించి వార్తా పత్రికల ద్వారా తెలుసుకున్న వాజ్‌పాయ్ తల్లడిల్లిపోయారు.

నా కిస్లే ఎక్కడున్నాడు..?
DPS స్కూలు విద్యార్థి అయిన కిస్లే కిడ్నాప్‌కు గురయ్యాడు.కొడుకు జాడ కోసం తల్లిదండ్రులు పడ్డ నరకయాతన అంతా ఇంతా కాదు. అదే సమయంలో విషయాన్ని తెలుసుకున్న వాజ్‌పాయ్... ముజఫర్‌పూర్ సభలో "నా కిస్లే ఎక్కడ..ఎవరైనా నా కిస్లేను తీసుకురండి" అంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ఈ ఒక్క డైలాగ్ బిహారీలను కదిలించింది.లాలూ ప్రభుత్వంపై ఈ ఒక్క ప్రశ్నతో దాడి చేశారు. అటల్ చెప్పిన ఈ ఒక్క డైలాగును అప్పటి వార్తా పత్రికల్లో ప్రధాన హెడ్‌లైన్స్‌గా నిలిచాయి.2005 జనవరి 27 నుంచే బీహార్‌లో అక్కడి ప్రజల్లో మార్పు ప్రారంభమైంది.

ఆ సమయంలో దాణా కేసులో లాలూ జైలులో ఉండగా ఆయన భార్య రబ్రీ దేవి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు పాలన ఎంతలా ఉండేదంటే ఏకంగా పాట్నా హైకోర్టు బీహార్‌లో ఆటవిక రాజ్యం కొనసాగుతోందంటూ వ్యాఖ్యానించింది. ఇక అప్పటి నుంచి విపక్షాలు జంగిల్‌రాజ్ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాయి. వాజ్‌పాయ్ చేసిన భావోద్వేగ ప్రసంగంతో అప్పటి ప్రభుత్వం కిస్లే జాడ కోసం సిట్ ఏర్పాటు చేసింది. చివరికి అంటే 13 రోజుల తర్వాత కిస్లే తిరిగి క్షేమంగా తన తల్లిదండ్రుల వద్దకు చేరాడు. అదే సమయంలో 2005 ఎన్నికల్లో లాలూ పార్టీ ఆర్జేడీకి మెజార్టీ దక్కలేదు. మరో ఇతర పార్టీకి కూడా మెజార్టీ లభించలేదు. దీంతో బీహార్‌లో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది.అదే ఏడాది నవంబర్‌లో ఎన్నికలు జరుగగా... బీజేపీ జేడీయూ కూటమి స్పష్టమైన మెజార్టీతో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.సీఎంగా నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు.ఇక అప్పటి నుంచి ప్రజలు జంగిల్ రాజ్‌ను కాదని నితీష్ కుమార్‌కే అధికారాన్ని కట్టబెడుతూ వస్తున్నారు.

అయితే లాలూ సర్కార్‌ను కూలదోయడంలో వాజ్‌పాయ్ ప్రసంగం కీలకంగా మారిందని అప్పటి అధికారులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఆ ఒక్క ప్రసంగం ప్రజల హృదయాలను తాకిందని చెబుతుంటారు. అప్పుడూ ఆ క్షణమే ప్రజల్లో బీహార్‌లో మార్పు ప్రారంభమైందని చెప్తారు. ఇక సురక్షితంగా ఇంటికి చేరిన కిస్లేతో ఆయన కుటుంబ సభ్యులతో వాజ్‌పాయ్ కలిసి మాట్లాడారని నాటి అధికారులు గుర్తు చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+