రాహుల్ ‘భూ కంపం’పై మోడీ కౌంటర్: సభలో నవ్వులు
తాను మాట్లాడితే భూకంపం వస్తుందన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రధాని నరేంద్ర మోడీ ఘాటైన కౌంటర్ ఇచ్చారు.
వారణాసి: తాను మాట్లాడితే భూకంపం వస్తుందన్న కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ప్రధాని నరేంద్ర మోడీ ఘాటైన కౌంటర్ ఇచ్చారు. 'ఓ యువనేత ఇప్పుడిప్పుడే మాట్లాడటం నేర్చుకుంటున్నారు, ప్రసంగాలు ఇస్తున్నారు. అతను మాట్లాడటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన మాట్లాడకపోతేనే భూకంపం వచ్చేది.. ఇప్పుడు మాట్లాడారు కనుక భూకంపం వచ్చే అవకాశమే లేదు' అని ప్రధాని మోడీ అన్నారు. దీంతో సమావేశంలో నవ్వులు విరిశాయి.
ఉత్తరప్రదేశ్‌లో క్యాన్సర్ కేంద్ర శంకుస్థాపన కార్యక్రమంలో మోడీ మాట్లాడారు. రాహుల్‌గాంధీ పేరు ప్రస్తావించకుండా ఆయనపై కౌంటర్లు వేశారు. పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంటు సమావేశాల్లో తనను మాట్లాడనివ్వడం లేదని, మాట్లాడితే భూకంపం వస్తుందని, మోడీ అవినీతికి సంబంధించిన వ్యక్తిగత సమాచారం తన వద్ద ఉందని.. రాహుల్ ఇటీవల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో మోడీ రాహుల్‌కు పైవిధంగా కౌంటర్ ఇచ్చారు. పెద్ద నోట్ల రద్దు చేస్తూ తాను తీసుకున్న నిర్ణయానికి 125కోట్లమంది భారతీయుల మద్దతు ఉందని మోడీ చెప్పారు.
దేశ భవిష్యత్ కోసమే పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ చేపట్టామని మోడీ తెలిపారు. ప్రతిపక్షాలు అవినీతిపరులకు మద్దతుగా నిలుస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పేదల కోసం చేసిందేమీ లేదని అన్నారు. నోట్ల రద్దుకు మద్దతు తెలిపినవారందరికీ ఈ సందర్భంగా మోడీ కృతయజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications