గిబ్లీ వాడకంలో ఇండియాలో ఆ రాష్ట్రమే టాప్..?
ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఎక్కడ చూసినా గిబ్లి స్టైల్ ట్రెండ్ నడుస్తోంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ప్రధాని మోడీ, అపర కుభేరుడు ఎలాన్ మస్క్ సహా పలువురు ప్రముఖులు సైతం ఈ ఎఫెక్ట్ లో తమ ఫోటోలను మార్చుకుంటున్నారు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఏదైనా కానీ గిబ్లీ ఫోటోలు దర్శనం ఇస్తున్నాయి.
నచ్చిన ఫోటోలను కన్వర్ట్ చేసుకుని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఈ ఫోటోలు యానిమేషన్ చిత్రాల మాదిరిగా ఉండటంతో ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. గిబ్లీ లానే పలు ఎఫెక్ట్ లు ఉన్నప్పటికీ ప్రజెంట్ ఈ ఫోటోల ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. అలానే గిబ్లీ ఫోటోలు క్రియేట్ చేసుకునేందుకు పలు అప్లికేషన్స్ అందుబాటులో ఉన్నప్పటికీ.. ఛాట్ జీపీటీ, గ్రోక్ ద్వారా ఫ్రీగా క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. జీపీటీ ప్లస్, ప్రో సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వారు ఎలాంటి పరిమితి లేకుండా ఫోటోలను మార్చుకునే అవకాశం అందిస్తుంది. సబ్ స్క్రిప్షన్ లేనివాళ్లు పరిమిత సంఖ్యలో ఫోటోలను కన్వర్ట్ చేసుకోవచ్చు.

అయితే ఇండియాలోనూ ఈ ఫీచర్ ను ఓ రేంజ్ లో ఉపయోగిస్తున్నారు. గిబ్లీని ఎక్కువగా ఉపయోగించే దేశాల్లో భారత్ టాప్ 5లో ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గూగుల్ ట్రెండ్స్ డేటా ప్రకారం గత వారం రోజులుగా ఇండియాలో ఈ ఫీచర్ ను నెటిజన్లు పెద్ద మొత్తంలో వినియోగిస్తున్నట్లు తేలింది. మన దేశంలో ఈ ఫీచర్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్న రాష్ట్రం ఏది ? తక్కువగా ఉపయోగిస్తున్న రాష్ట్రం ఏది ? తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏ రేంజ్ లో దీన్ని ఉపయోగిస్తున్నారో తెలుసుకుందాం.
టాప్ లో ఏ రాష్ట్రం అంటే..?
ఇక గత వారం రోజులుగా గిబ్లీ ఫీచర్ ను అత్యధిక స్థాయిలో వినియోగించిన్న లిస్టులో మహారాష్ట్ర ఉంది. ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో గుజరాత్, అస్సాం నిలిచాయి. అదే విధంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 74 శాతం, ఏపీలో 66 శాతం నెటిజన్లు ఈ ఫీచర్ ను ఉపయోగిస్తున్నట్లు తేలింది. మరోవైపు మిజోరాం, మణిపూర్, జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్, మేఘాలయ, పంజాబ్, బీహార్ రాష్ట్రాలు గిబ్లీ పట్ల తక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.
-
జైపూర్ ఏనుగుకు గులాబీ రంగు పూసిన రష్యన్.. జైలుకు వెళ్లక తప్పదా ??? -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications