స్మృతి ఎవరు?: ప్రియాంక ప్రశ్న, ఎవరికీ మెజార్టీ రాదని..
చిత్తూరు: ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పైన భారతీయ జనతా పార్టీ తరఫున ప్రముఖ టీవీ నటి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. రాహుల్ పైన అమేథీలో స్మృతి పోటీ పడుతున్నారు. అయితే, సోమవారం రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ ఆశ్చర్యకరమైన వ్యాఖ్య చేశారు. స్మృతి ఇరానీ గురించి ప్రశ్నిస్తే... ఆమె ఎవరని అడిగారు. తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని ప్రియాంక గాంధీ చెప్పారు. ఏ పార్టీకి సంపూర్ణ మెజార్టీ రాదని ఆమె అభిప్రాయపడ్డారు.
తనను ఎవరని ప్రియాంక గాంధీ ప్రశ్నించడం పైన స్మృతి ఇరానీ కూడా ఘాటుగానే స్పందించారు. ప్రియాంక వ్యాఖ్యలపై తాను ఆశ్చర్యపోలేదని చెప్పారు. కుటుంబ సభ్యుల కుంభకోణాలు మర్చిపోయే ప్రియాంక గాంధీ తనను గుర్తు పెట్టుకుంటుందని ఎలా భావిస్తానని చెప్పారు. స్మృతి ట్విట్టర్ ద్వారా ప్రతిస్పందించారు.

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్, ఎస్పీ, బిఎస్పీ వేర్వేరుగా ఉంటాయని, ఢిల్లీలో మాత్రం ఈ మూడు పార్టీలు కలిసిపోతాయని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ విమర్శించారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోడీ మాట్లాడారు. మోసం, కుట్ర రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ ఓడించాలన్నారు. కాంగ్రెస్ అవినీతి పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఊపిరి ఉన్నంత వరకు అవినీతిపై పోరాడుతానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications