తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.రామ్మోహన్ రావు జయకు అత్యంత ఆప్తుడు
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రామ్మోహన్ రావు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాద్యతలు నిర్వహిస్తున్నారు. జయలలితకు ఆయన అత్యంత సన్నిహితుడుగా పేరుంది. శశికళ, పన్నీర్ సెల్వం కు కూడ అత్యంత
చెన్నై :తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు ఇంట్లో ఆదాయపు పన్నుశాఖాధికారులు సోదాలు నిర్వహించడం సంచలనం రేపుతోంది. అయితే అసలు రామ్మోహన్ రావు ఎవరు, ఆయనకు జయలలిత ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారనే విషయాలపై ప్రస్తుతం చర్చసాగుతోంది. జయలలిత కార్యదర్శి స్థాయి నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎలా మారారనేది చర్చ సాగుతోంది.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పి.రామ్మోహన్ రావు 1985 బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారి, ఆయన తమిళనాడు రాష్ట్ర బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారి.సబ్ కలెక్టర్ గా ఆయన సర్వీసును ప్రారంభించాడు. జయలలిత వద్ద తొలుతు కార్యదర్శిగా పనిచేశాడు. అయితే రెండో సారి కూడ ఆమె అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఏడాది జూలై మాసంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా భాద్యతలను స్వీకరించారు.
జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయనను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదద్శిగా నియమంచడంపై వివాదాస్పదమైంది. ఆనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జానదేశికన్ ను అర్థాంతరంగా ఆ భాద్యతల నుండి తప్పించి ఆ స్థానంలో పి. రామ్మోహన్ రావును రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జయలలిత నియమించారు.
ఆ నియామకం రాష్ట్ర అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.పైగా వివాదాస్పదమైంది .200103 మద్య కాలంలో ఆయన గుజరాత్ మారిటైమ్ బోర్డు వైస్ చైర్మెన్ పగ్గాలు చేపట్టేందుకు డిప్యూటేషన్ పై వెళ్ళాడు.జయలలితతో పాటు ఆమె సన్నిహితురాలు శశికళ, ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కు కూడ ఆయన వ్యక్తిగత ఆర్థిక సలహాదారుగా వ్యవహరించారని చెబుతారు.

జయకు అత్మంత విశ్వాసపాత్రుడు
2011లో జయలలిత ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన తర్వాత ఆమె మద్ద ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా చేరాడు. జయలలితకు ఆయన అత్యంత విశ్వాసపాత్రుడుగా పేరుంది. అందుకే ఆయనను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారని చెబుతారు.తమిళనాడు రాష్ట్రానికి చెందిన అధికార వర్గాల్లో ఆయన చక్రం తిప్పేవారు. ఆయన అంటే అధికారులకు హడల్.పాలనపరంగా ఆయన చెప్పిందే వేదంగా భావిస్తారు అధికారులు.

శేఖర్ రెడ్డితో సంబంధాలతోనే రామ్మోహన్ రావు ఇంటిపై సోదాలు
టిటిడి మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి తో తమిళనాడు సిఎస్ రామ్మోహన్ రావుకు సంబంధాలున్నాయని ఆమె ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల కారణంగానే రామ్మోహన్ రావు ఇంటిపై ఆదాయపు పన్ను శాఖాధికారులు దాడులు నిర్వహించారు. తమిళనాడు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఆదాయపు పన్నుశాఖాధికారులు దాడులు చేయడం ఇదే తొలిసారి.

శశికళ పేరు ముందుకు రావడంలో కూడ ఆయనదే పాత్ర
జయలలిత మరణం తర్వాత పార్టీ లో కీలక పదవికి శశికళ పేరు రావడం వెనుక ఆయన పాత్ర ఉందనే ప్రచారం కూడ తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఉంది. జయలలిత మరణం తర్వాత పార్టీ లో శశికళ కీలకపదవిని చేపడతారనే ప్రచారం కూడ ఉంది. అయితే దీని వెనుకు రామ్మోహన్ రావు కీలకమైనభూమికను పోషించారని పార్టీ వర్గాలు చెబుతున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కీలక భాద్యతలు నిర్వహించారు.
రామ్మోహన్ రావు రాష్ట్ర ప్రభుత్వంలో పలు కీలకమైన ఉద్యోగ భాద్యతలను నిర్వహించారు.విజిలెన్స్ కమీషనర్, ఆడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమీషనర్ గా పనిచేశారు.వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేశాడు. వాటర్ రిసోర్స్ , రవాణ, సోషల్ వేల్పేర్ , గృహనిర్మాణ , అర్బన్ డెవలప్ మెంట్ , టీచర్ రిక్రూట్ మెంట్ చైర్మెన్ గా పనిచేశాడు. తమిళనాడు ప్రింట్ అండ్ పేపర్స్ లిమిటెడ్ , కమీషనర్ ,రిఫార్మ్స్ కు సిఎండి గా పనిచేశాడు రామ్మోహన్ రావు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications