వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవ‌రీ స‌య్య‌ద్ షుజూ..? ఈవీయంల‌ టాంప‌రింగ్ ఆరోప‌ణ‌ల వెన‌క ఆంత‌ర్యం ఏంటి..?

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్ : 2014లో ఈవీయంల టాంప‌రింగ్ వ‌ల్ల రాజ‌కీయ అస్థిర‌త చోటు చేసుంద‌ని, కాంగ్రెస్ పార్టీ ఏకంగా 201సీట్ల‌లో ప‌రాజ‌యం పాలైంద‌ని ఈవీయంలు త‌యారు చేసే సంస్థ‌లో ప‌నిచేసిన ఉద్యోగి స‌య్య‌ద్ సుజూ తెలిపారు. ఆయన చేసిన వ్యాఖ్య‌లు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారుతున్నాయి. టాంప‌రింగ్ లో రిల‌య‌న్స్ సంస్థ‌కు భాగ‌ప్వామ్యం ఉంద‌ని మ‌రో బాంబు పేల్చారు స‌య్య‌ద్. అంతే కాకుండా హైద‌రాబాద్ కేంద్రంగా ఈ ట్యాప‌రింగ్ వ్య‌వ‌హారం న‌డిచింద‌ని వాడి వేడి కామెంట్లు చేసారు. ఇంత‌కీ ఎవ‌రీ స‌య్య‌ద్..? తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం..!

హైదరాబాద్‌ కేంద్రంగానే ఈవీయంల టాంపరింగ్‌.!సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ ఈసీఐఎల్‌ మాజీ ఉద్యోగి..!

హైదరాబాద్‌ కేంద్రంగానే ఈవీయంల టాంపరింగ్‌.!సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన‌ ఈసీఐఎల్‌ మాజీ ఉద్యోగి..!

ఈవీఎంల టాంపరింగ్‌పై బాంబ్‌పేల్చిన సయ్యద్‌ షూజూ ఎవరూ? అనేదానిపై ఇపుడు దేశవ్యాప్తంగా చర్చసాగుతోంది. అయితే ఇతను ఈవీఎంల తయారు చేసే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఈసీఐఎల్‌ మాజీ ఉద్యోగి కావడం గమనార్హం. సయ్యద్‌ షూజూ 2009-14లో ఈసీఐఎల్‌ సంస్థలో పనిచేశాడు. లండన్‌లో ఈవీఎంల టాంపరింగ్‌పై జరిగే డెమో కార్యక్రమంలో ఇతను పాల్గోవాల్సి ఉంది. అయితే ఇతనిపై నాలుగు రోజుల కిందట దాడి జ‌రిగిందని తానే స్వ‌యంగా చెప్పుకొస్తున్నాడు. దీంతో అతను వీడియో కాన్ఫెరెన్స్‌ద్వారానే పాల్గొని ఈవీఎంలు ఎలా హ్యాక్‌ చేయవచ్చనేది చూపించాడు.

రైతుబంధు పై ఆశ‌లు పెట్టుకున్న మోదీ..! 70వేల కోట్ల‌తో ప‌థ‌కానికి రూప‌క‌ల్ప‌న‌..!! రైతుబంధు పై ఆశ‌లు పెట్టుకున్న మోదీ..! 70వేల కోట్ల‌తో ప‌థ‌కానికి రూప‌క‌ల్ప‌న‌..!!

బీజేపీ, రిలయన్స్‌పై ఆరోపణలు..! స‌య్య‌ద్ వ్యాఖ్య‌ల‌పై దుమారం..!!

బీజేపీ, రిలయన్స్‌పై ఆరోపణలు..! స‌య్య‌ద్ వ్యాఖ్య‌ల‌పై దుమారం..!!

గత లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంలు టాంపర్‌ చేసినట్లు సైబర్‌ నిపుణుడు, మాజీ ఈసీఐఎల్‌ ఉద్యోగి సయ్యద్‌ షూజా ఆరోపించారు. ఈ కారణంగానే కాంగ్రెస్‌ పరాజయం పొందిందని తెలిపారు. ఈవీఎంల టాంపరింగ్‌ వల్ల 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ 201 పార్లమెంట్‌ స్థానాలు కోల్పోయిందని సైబర్‌ నిపుణుడు సయ్యద్‌ షూజూ వెల్లడించాడు. ఉత్తర ప్రదేశ్‌, గుజరాత్‌, మధ్య ప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌ఘడ్‌, ఢిల్లీలో ఫలితాలను తారుమారు చేసారని తెలిపారు. మిలటరీ గ్రేడ్‌ ఫ్రీక్వెన్సీని విడుదల చేసి మాడ్యూలేటర్‌తో ఈవీఎంలను బీజేపీ హ్యాక్‌ చేసిందని చెప్పారు స‌య్య‌ద్.

ఈవీయంలు టాంప‌రింగ్ చేయొచ్చు..! డెమో చూపించిన స‌య్య‌ద్..!!

ఈవీయంలు టాంప‌రింగ్ చేయొచ్చు..! డెమో చూపించిన స‌య్య‌ద్..!!

లోక్‌సభ ఎన్నికల్లో వాడిన ఈవీఎంల నుంచి సిగ్నల్‌ వస్తున్నట్లు తాము గమనించి పరిశోధించగా అసలు విషయం వెల్లడైందని చెప్పారు. ఈసీఐఎల్‌లో రూపొందించిన ఈవీఎంల తయారీలో తాను కూడా భాగస్వామినేనని ఆయన చెప్పారు. ప్రస్తుతం అమెరికాలో స్థిరపడిన షూజూ సోమవారం లండన్‌ నుంచి ఈవీఎంలను హ్యాక్‌ చేయడాన్ని ప్రదర్శించారు. అంతేకాదు ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎక్కడెక్కడ ఈవీఎంలను టాంపర్‌ చేశారో కూడా తాను గుర్తించగలనని చెప్పారు.

ఈవీఎంలను ట్యాపరింగ్ చేయ‌డం అసాద్యం..! స్ప‌ష్టం చేస్తున్న ఎన్నిక‌ల సంఘం..!!

ఈవీఎంలను ట్యాపరింగ్ చేయ‌డం అసాద్యం..! స్ప‌ష్టం చేస్తున్న ఎన్నిక‌ల సంఘం..!!

ఇదిలా ఉండ‌గా ఈవీఎంలను ట్యాపరింగ్‌ లేదా హ్యాక్‌ చేయడం అసాధ్యమని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల నిర్వాహణలో తాము ఉపయోగిస్తున్న ఈవీఎంలను ట్యాంపర్‌ చేయడం సాధ్యమేనంటూ లండన్‌లో కొందరు ఏర్పాటు చేసిన ప్రదర్శనపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఎన్నికల సంఘంపై అనవసరంగా బురదజల్లితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతమధ్య ఈవీఎంలను భెల్‌, ఈసీఐఎల్‌ సంస్థలు వీటిని తయారు చేస్తున్నాయని తెలిపింది.

English summary
In 2014, the epic tambouring caused political instability, The Congress party has suffered a loss of 201 seats, said Syed Sujoo, farmer employee at ECIL. His remarks over EVM'S are becoming sensational throughout the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X