గుజరాత్‌లో గెలుపు ఎవరిది?: అందరరి చూపూ ఆ వైపే
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అందరి చూపూ గుజరాత్ ఎన్నికల ఫలితాలపైనే ఉంది. ఈ ఫలితాలు గుజరాత్ రాష్ట్రానికి మాత్రమే కాకుండా ప్రధాని నరేంద్ర మోడీకి, బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షాకు కూడా అత్యంత కీలకమైనవి.
బిజెపి విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. బిజెపి విజయం సాధిస్తే మోడీకి, అమిత్ షాకు తిరుగుండదు. వారు మరింత వేగంగా ముందుకు దూసుకుపోవడానికి ప్రేరణను అందిస్తాయి.

బిజెపి ఓటమిపాలైతే మాత్రం తీవ్ర పరిణామాలు ఉండవచ్చు. దాని ప్రభావం కేంద్ర ప్రభుత్వంపైన కూడా పడుతుంది. రెండేళ్లు మాత్రం లోకసభ ఎన్నికలకు సమయం ఉన్న నేపథ్యంలో బిజెపి కష్టాల్లో పడినా పడవచ్చు.
కాంగ్రెసు అధ్యక్ష పదవిని ఇటీవలే చేపట్టిన రాహుల్ గాంధీకి మాత్రం ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. ఈ ఎన్నికలు గుజరాత్‌కు మాత్రమే కాకుండా దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేస్తుంది.












Click it and Unblock the Notifications