‘‘అతడి చెంప పగలగొట్టండి.. రూ.కోటి ఇస్తా..’’ ‘‘అలాగా.. పెళ్లికొస్తాగా.. రచ్చరచ్చే..’’

ఈ మధ్య బీహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోడీ(బీజేపీ) పై తేజ్‌ ప్రతాప్ యాదవ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆయన అక్రమాలను బయటపెడతానని.. ప్రజల ముందే చెంప పగలకొడతానని వ్యాఖ్యానించారు.

పాట్న : ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పెద్ద కొడుకు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ చెంప పగలగొట్టిన వారికి రూ.కోటి ఇస్తానంటూ బీజేపీ నేత అనిల్‌ సాహ్ని శుక్రవారం ఓ ప్రకటన జారీచేశారు.

ఈ మధ్య బీహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోడీ(బీజేపీ) పై తేజ్‌ ప్రతాప్ యాదవ్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆయన అక్రమాలను బయటపెడతానని.. ప్రజల ముందే చెంప పగలకొడతానని వ్యాఖ్యానించారు.

Whoever slaps Tej Pratap Yadav will get Rs 1 crore, says BJP leader

ఈ నేపథ్యంలో పట్నా బీజేపీ మీడియా ఇన్‌ఛార్జ్‌ అయిన సాహ్ని ఈ కొత్త ఆఫర్‌ ప్రకటించాడు. ''మోడీపై దాడి చేస్తానని తేజ్‌ చెప్పాడు.. అంతకంటే ముందే ఎవరైతే తేజ్‌ ప్రతాప్ యాదవైపై దాడి చేసి అతడి చెంప పగలగొడతారో వారికి కోటి రూపాయలు బహుమతిగా ఇస్తాం..'' అని ప్రకటించారు. అంతేకాదు తేజ్‌ చేత క్షమాపణలు చెప్పేదాకా లాలూ ఇంటి ముందు ధర్నా చేపడతామని అనిల్ సాహ్ని హెచ్చరించారు.

సాహ్ని వ్యాఖ్యలపై బీజేపీ అధిష్టానం మాత్రం గరంగరం అయింది. అనిల్ సాహ్ని ప్రకటనతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని.. ఇప్పటికే దీనిపై వివరణ కోరామని... అది సహేతుకంగా లేకపోతే క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడమని పేర్కొంది. అంతేకాకుండా, లాలూ ప్రసాద్ యాదవ్ తన కొడుకులను అదుపులో పెట్టుకోవాలని కూడా సూచించింది.

మరోవైపు ఔరంగాబాద్‌లో తేజ్‌ ప్రతాప్ యాదవ్ ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ... డిసెంబర్‌ 3న జరగబోయే సుశీల్‌ కొడుకు ఉత్కర్ష్‌ పెళ్లి ఆహ్వానం తనకు అందిందని.. ఒకవేళ తాను అక్కడికి వెళ్తే మాత్రం రచ్చ చేయటం ఖాయమని హెచ్చరికలు చేశాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+