కరుణానిధిని దహనం కాదు, ఖననమే చేశారు: ఎందుకంటే?
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం కరుణానిధి అంతిమ సంస్కారాలు బుధవారం సాయంత్రం పూర్తయ్యాయి. మెరీనా బీచ్‌లోని అన్నా స్క్వేర్ ప్రాంగణంలో ప్రభుత్వ లాంఛనాలతో కరుణ అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబసభ్యులు, రాజకీయ, సినీ ప్రముఖులు, లక్షలాది మంది అభిమానులు ఆశ్రునయనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు.
కరుణానిధిని ఖననం చేయడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. హిందూ సాంప్రదాయం ప్రకారం చిన్న పిల్లల్ని, సాధువుల్ని, పెళ్లి కాని వారిని తప్ప మిగితా ఎవరూ మరణించిన వారిని దహనం (క్రిమేషన్) చేస్తారు. కేవలం క్రైస్తవులు, ముస్లింలు మాత్రమే ఖననం (బరియల్) చేస్తారు.

కానీ, కరుణానిధిని కూడా ఖననం చేశారు. ఎందుకిలా అంటే కరుణానిధి హిందూ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే అయినప్పటికీ.. ఆయన నాస్తికుడు. జీవించినంత కాలం ఆయన తనను తాను నాస్తికునిగానే ప్రచారం చేసుకున్నారు.
ఆ కారణంగానే కరుణానిధి అభిప్రాయాలకు విలువ ఇస్తూ ఆయనను దహనం చేయకుండా ఖననం చేశారు. ఒక కరుణానిధినేగాక, గతంలో పెరియార్ ఇ.వి. రామసామి, సీఎన్ అన్నాదురై వంటి నేతలను కూడా ఖననం చేశారు.












Click it and Unblock the Notifications