నేను చెబుతున్నా, నరేంద్ర మోడీ అవినీతిపరుడు: రాఫెల్ డీల్‌పై రాహుల్ గాంధీ
Recommended Video

న్యూఢిల్లీ: రాఫెల్ స్కాం పైన ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై గురువారం మరోసారి విమర్శలు కురిపించారు. రాఫెల్ స్కాంతో రూ.30 వేల కోట్లు అనిల్ అంబానీ జేబులో వేశారని తీవ్రంగా మండిపడ్డారు. రాఫెల్ డీల్‌లో రిలయన్స్‌కు భాగస్వామ్యం కేవలం ప్రతిఫలమేనని ఆరోపించారు.
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇంత హఠాత్తుగా ఫ్రాన్స్ ఎందుకు వెళ్లవలసి వచ్చిందని ప్రశ్నించారు. ఇంతకు మించిన అవినీతి వ్యవహారం మరొకటి ఉండదని చెప్పారు. దేశానికి కాపలాదారుగా ఉంటానని చెప్పిన ప్రధాని మోడీ.. అనిల్ అంబానీకి ప్రధానిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

రాఫెల్ డీల్ రిలయెన్స్‌తో కుదుర్చుకోవాలని తమకు భారత ప్రధాని చెప్పారని గతంలో ఫ్రెంచ్ మాజీ ప్రధాని చెప్పారని రాహుల్ గాంధీ అన్నారు. ఇప్పుడు సీనియర్ అధికారి కూడా అదే విషయం చెప్పాడని అన్నారు. కాబట్టి ఇందులో పూర్తిగా అవినీతి జరిగిందని తేలిపోయిందని అన్నారు.
నిర్మలా సీతారామన్ సడన్‌గా ఫ్రాన్స్‌కు వెళ్లి, రాఫెల్ ప్లాంట్‌కు వెళ్లవలసిన అవసరం ఏమి వచ్చిందని నిలదీశారు. అంత త్వరగా వెళ్లవలసిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. నేను ఈ దేశంలోని యువతకు స్పష్టంగా చెప్పదలుచుకున్నానని, ప్రధాని నరేంద్ర మోడీ అవినీతిపరుడు అని తీవ్ర ఆరోపణలు చేశారు.












Click it and Unblock the Notifications