ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ఆ ఐదు స్థానాలపైనే అందరి ఫోకస్..?
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 70 నియోజకవర్గాలకు ఒకేసారి నిర్వహిస్తున్నారు. అధికారంలో ఉన్న ఆప్, బీజేపీ, కాంగ్రెస్, మధ్య ఈసారి త్రిముఖ్య పోటీ నెలకొంది. అన్నీ పార్టీలలో కలిపి 699 మంది అభ్యర్ధులు ఎన్నికల బరిలో ఉన్నారు. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.
హ్యాట్రిక్ విజయాన్ని సాధించి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆప్ భావిస్తోంది. అయితే ఈసారి ఎలాగైనా ఢిల్లీలో పాగా వేయాలని కాంగ్రెస్, బీజేపీ పోటీ పడుతున్నాయి. ఎవరికి వారు అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తించారు. ఈ క్రమంలోనే ఐదు నియోజకవర్గాల ఫలితాలపై మాత్రం హస్తిన వాసులు స్పెషల్ ఇంటరెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది.

ఢిల్లీ వసూలు అంతా స్పెషల్ ఫోకస్ పెట్టిన ఆ ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలలో.. మాజీ సీఎం, ప్రస్తుత సీఎంలతో పాటు మాజీ డిప్యూటీ సీఎం పోటీ చేస్తున్న నియోజకవర్గాలు ఉన్నాయి. అలానే మరో రెండు నియోజకవర్గాలు సైతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
న్యూఢిల్లీ..
హస్తిన వాసులు ఫోకస్ పెట్టిన నియోజకవర్గాల్లో న్యూఢిల్లీ మొదటగా వినిపిస్తోంది. మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ఇక్కడి నుంచే బరిలోకి దిగుతున్నారు. అయితే కేజ్రీవాల్ ని ఎలాగైనా ఓడించాలని.. బీజేపీ, కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. బిజెపి తరపున మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు పర్వేశ్ సాహిబ్ సింగ్ పోటీలో ఉన్నారు. అలానే కాంగ్రెస్ తరపున మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ బరిలో ఉన్నారు. దీంతో కేజ్రీవాల్ వర్సెస్ మాజీ సీఎంల కుమారులుగా పోటీ ఉండడంతో సర్వత్రా ఆసక్తిగా మారింది.
కల్కాజీ..
ఢిల్లీ ముఖ్యమంత్రి, అతిశీ ఈ నియోజకవర్గం నుంచి పోటీపడుతున్నారు. ఆమెకు పోటీగా బీజేపీ తరఫున రమేశ్ బిధూరి పోటీలో ఉన్నారు. వీరిద్దరి మధ్యే ప్రధానంగా పోటీ ఉండనుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జంగ్ పుర..
ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా జంగ్ పుర నుంచి పోటీ చేస్తున్నారు. లిక్కర్ స్కాంలో జైలుకి వెళ్లొచ్చిన తర్వాత ఇక్కడి నుంచి బరిలోకి దిగుతుండడంతో హాట్ టాపిక్ గా మారింది. సిసోడియాకు పోటీగా బీజేపీ నుంచి తర్వీందర్, కాంగ్రెస్ నుంచి పర్హాద్ సూరి ఉన్నారు.
బిజ్వాసన్..
ఆప్ కి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరిన మాజీ మంత్రి కైలాశ్ గెహ్లాట్ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనకు పోటీగా ఆప్ నుంచి సురేంద్ర భరద్వాజ్, కాంగ్రెస్ నుంచి దేవేంద్ర సెహ్రావత్ ఉన్నారు.
పర్పత్ గంజ్..
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి మనీశ్ సిసోడియా పోటీచేసి విజయం సాధించారు. అయితే ఈసారి ఆయన స్థానంలో యూపీఎస్సీ ట్యూటర్ గా పేరొందిన అవధ్ ఓజా ఇక్కడ బరిలోకి దిగుతున్నారు.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications