వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిదంబరం అరెస్ట్‌తో పాక్‌లో నిరసనలు..!! ఆ రహస్యమెంటో..?? సుబ్రమణ్యస్వామి సంచలనం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : బీజేపీ నేత, కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ సుబ్రమణ్య స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు భారత్ కన్నా పాకిస్థాన్‌కు మేలు జరిగిందని పరోక్షంగా కామెంట్ చేశారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టైన చిదంబరం .. ఇప్పటికే సీబీఐ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సుబ్రమణ్యస్వామి కామెంట్లు ఆసక్తికరంగా మారాయి. అప్పటి ఆర్థికమంత్రి భారత్‌కు మేలు చేయలేదా అనే ప్రశ్నలు తొలుస్తున్నాయి.

అక్కడే ఎందుకు ..

అక్కడే ఎందుకు ..

వాస్తవంగా ఏ నేత, లేదా పేరున్న వారు అరెస్ట్ అయితే స్థానికంగా కలకలం రేగుతుంది. ఈ అంశాన్ని సుబ్రమణ్య స్వామి ప్రస్తావించడం నిజమేనా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయన అరెస్టైతే స్వస్థలం తమిళనాడులో నిరసనలు జరుగాలి .. కానీ అక్కడ అలాంటి పరిస్థితి లేదని సుబ్రమణ్యస్వామి చెప్పారు. తమిళనాడులో కాకుండా పాకిస్థాన్‌లో నిరసనలు జరుగుతున్నాయని ప్రస్తావించారు. పాకిస్థాన్‌లో ఆందోళనలు ఏంటీ అనే చర్చకు దారితీసింది.

కారణమిదీ ..

కారణమిదీ ..

ఇందుకు సుబ్రమణ్యస్వామి వివరణ కూడా ఇచ్చారు. 2005లో పాకిస్థాన్ కరెన్సీ ప్రింటింగ్ చేసే కంపెనీకే భారత కరెన్సీ పేపర్ కాంట్రాక్టును ఇచ్చారని పేర్కొన్నారు. దీనిని కట్టబెట్టింది స్వయంగా అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం అని సెలవిచ్చారు. దాయాది దేశంపై కయ్యానికి కాలుదువ్వాలే గానీ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే నోట్ల ముద్రణ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఇందులో చిదంబరం రహస్యం ఉందని ఉద్ఘాటించారు. దీంతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నదని పేర్కొన్నారు. అంటే శత్రుదేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడేందుకు చిదంబరం దోహదపడ్డారని విమర్శించారు.

 నకిలీ నోట్ల కట్టలు ..

నకిలీ నోట్ల కట్టలు ..

అంతేకాదు అప్పటినుంచి దేశంలోకి నకిలీనోట్ల చలామణి పెరిగిందని వివరించారు. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని తెలిపారు. దాయాది దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా పుంజుకుంటే .. మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నదని పేర్కొన్నారు. కానీ 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న చర్యలతో నకిలీ నోట్ల చెలామణి తగ్గిందని వివరించారు. 2016లో పెద్ద నోట్ల రద్దుతో పాకిస్థాన్ ఆటలకు కళ్లెం వేయగలిగామని తెలిపారు. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకొని .. పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని పేర్కొన్నారు. మన దేశంలో నకిలీ నోట్ల చెలామణికి అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం కారణమని ఆరోపించారు. అంతేకాదు శత్రుదేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడానికి సహకరించారని పేర్కొన్నారు. దీనిని బట్టి పాకిస్థాన్‌తో చిదంబరానికి నేరుగా సంబంధాలు ఉన్నాయని రుజువైందన్నారు.

మేలుకు గుర్తుగా ..

మేలుకు గుర్తుగా ..

తమకు మేలుచేసిన చిదంబరం అరెస్ట్ అవడాన్ని అక్కడి ప్రతినిధులు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. తమకు చేసిన మేలుకు కృతజ్ఞతగా ఆ దేశంలో నిరసనలు చేపడుతున్నారని వివరించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఊచలు లెక్కబెడుతున్న చిదంబరం .. సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యలతో మరింత ఇరుకునపడ్డట్లైంది. దీనిపై అన్నిపక్షాల నుంచి నిరసన వ్యక్తమైతే .. చిదంబరం కార్నర్ కాక తప్పని పరిస్థితి. అసలేం జరిగిందో వివరించాల్సిన సిచుయేషన్. అప్పటికీ నమ్మకుంటే విచారణకు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది.

English summary
Subramanya Swamy once again made sensational comments. Former Union Finance Minister Chidambaram has been heavily criticized. He indirectly commented that Pakistan was doing better than India when he was the finance minister. Chidambaram, who was arrested in the INX media case, is already in CBI custody.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X