శాంతి .. శాంతి ... మమతకు అసహనం పెరిగింది : మోదీ

న్యూఢిల్లీ : సేవ్ డెమోక్రసీ పేరుతో నిర్వహించిన ర్యాలీలో హింస చెలరేగడంతో బీజేపీ, టీఎంసీ మధ్య మాటల యుద్ధం పతాకస్థాయికి చేరింది. హింసకు కారణం బీజేపీ, టీఎంసీ అని పరస్పరం దూషించుకొంటున్న క్రమంలో ప్రధాని మోదీ కూడా స్పందించారు. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ అసహనంలో ఉన్నారని తనదైనశైలిలో కామెంట్ చేశారు.

శాంతి .. శాంతి ...
హింస తర్వాత బీజేపీ శ్రేణులు ఎందుకంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మోదీ అడిగారు. దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తోందని చెప్పారు. అమిత్ ర్యాలీకి వచ్చిన ప్రజలను చూసి మమత మైండ్ బ్లాంక్ అయ్యిందని వెల్లడించారు. దీంతో ఆమెలో అసహనం పెరిగిపోయిందని గుర్తుచేశారు. అందుకే ఆమె హింస చెలరేగడానికి కారణమవుతున్నారని విమర్శించారు. మంగళవారం బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే మమతకు నచ్చదని సెటైర్లు వేశారు.

Why so much anger? Mamata is intolerant, says PM Modi in Bengal

టీఎంసీ .. ఇక ఇంటికే ....
మోదీ బుధవారం బర్హిత్‌ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ .. రాష్టంలో టీఎంసీకి కాలం వెళ్లిందని గుర్తుచేశారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఈ ఎన్నికల ఫలితాలతో అది రుజువవుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మమతకు మోదీ రిక్వెస్ కూడా చేశారు. జరిగిన పరిణామాలతో ఆగ్రహానికి గురికాకండి .. మీ అసహనం గురించి నాకు తెలుసు అని వ్యాఖ్యానించారు. అంతేకాదు పౌరసత్వ బిల్లు సవరణ సమయంలో కూడా టీఎంసీ అడ్డుకుందని ఆరోపించారు. బెంగాల్‌లో చొరబాటుదారులను మమతా సర్కార్ తీసివేస్తోందని .. అయితే వారికి 2022 వరకల్లా పక్కా ఇళ్లు కట్టిస్తామని మోదీ బహిరంగ సభలో హామీనిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+