మౌన ముని మోడీజీ..పెదవి విప్పరేమి: సోషల్ మీడియాలో యాక్టివ్ కదా: ఈ వీడియో చూశారా
లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరిలో హింసాత్మక పరిస్థితులకు దారి తీసిన వీడియో.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మొత్తంగా ఎనిమిది మంది మరణానికి కారణమైంది ఈ ఘటన. నలుగురు రైతులు కారు కింద పడి దుర్మరణం పాలు కాగా.. ఆ తరువాత చోటు చేసుకున్న అలర్లు, హింసాత్మక వాతావరణంలో మరో నలుగురు మరణించారు. ఇద్దరు రైతులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

వీడియోను వెలుగులోకి తెచ్చిన కాంగ్రెస్..
ఈ వీడియోను కాంగ్రెస్ పార్టీ వెలుగులోకి తీసుకొచ్చింది. తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో దీన్ని పోస్ట్ చేసింది. 27 సెకెన్ల నిడివి ఉన్న వీడియో ఇది. జెండాలను పట్టుకుని ముందుకు నడుస్తోన్న రైతులపై ఓ నల్లరంగు ఎస్‌యూవీ కారు దూసుకెళ్లడం ఇందులో స్పష్టంగా రికార్డయింది. తొలుత తెల్లరంగు షర్ట్, లేత ఆకుపచ్చని తలపాగాను ధరించిన ఓ వృద్ధుడిని ఢీ కొట్టడం, అతను ఎగిరి బోనెట్ మీద పడటాన్ని ఈ వీడియోలో చూడొచ్చు.

వీడియో చూశారా?
ఈ వీడియోను ఆధారంగా చేసుకున్ని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, ఉత్తీర ప్రదేశ్ తూర్పు ప్రాంత పార్టీ ఇన్‌ఛార్జ్ ప్రియాంకా గాంధీ వాద్రా చెలరేగిపోయారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఘాటు విమర్శలను సంధించారు. ఈ వీడియోను చూశారా? అంటూ తన మొబైల్ ఫోన్ నుంచి..దాన్ని ప్రదర్శించారు. లఖింపూర్ ఖేరిలో నలగురు రైతుల మరణానికి కారణమైన వ్యక్తిని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు.

28 గంటలుగా నిర్బంధం..
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మోడీ ఈ వీడియోను చూసే ఉండొచ్చని తాను భావిస్తున్నట్లు చెప్పారు. లఖింపూర్ ఘటనను ప్రశ్నించిన తనను 28 గంటలుగా ఎందుకు నిర్బంధించారని నిలదీశారు. తనపై ఒక్క కేసు గానీ, ఎఫ్ఐఆర్‌ను గానీ నమోదు చేయకుండానే నిర్బంధంలో ఎందుకు ఉంచారని ప్రశ్నించారు. ప్రియాంక గాంధీని అరెస్ట్ చేసిన పోలీసులు ఆమెను సీతాపూర్‌లోని ప్రాదేశిక్ ఆర్మ్డ్ కాన్‌స్టిబిలరీ గెస్ట్‌హౌస్‌లో నిర్బంధించిన విషయం తెలిసిందే. ఆమెతో పాటు ఉత్తర ప్రదేశ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ, జాతీయ ప్రధాన కార్యదర్శి ధీరజ్ గుర్జర్, యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు బీవీ శ్రీనివాస్ తదితరులు అరెస్ట్ అయ్యారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే ఇదేనా..
కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని, దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన తరువాత కూడా లఖింపూర్ ఖేరి వంటి ఘటనలు అమానవీయానికి, ఆటవికానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని మండిపడ్డారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అంటే ఇదేనా? అంటూ నిలదీశారు. దేశానికి స్వాతంత్య్రాన్ని తీసుకుని రావడంలో రైతులు కీలక పాత్ర పోషించారని, అలాంటి వారిపైనే వాహనాలను నడిపించిన బీజేపీ నాయకులు- ఇప్పటిదాకా అరెస్ట్ కాకపోవడానికి కారణాలేమిటని నిలదీశారు.

ఇప్పటిదాకా ఎందుకు స్పందించట్లేదు..
లఖింపూర్ ఖేరిలో చోటు చేసుకున్న ఉదంతంపై ప్రధానమంత్రి ఇప్పటిదాకా ఎందుకు స్పందించట్లేదని ప్రియాంక గాంధీ వాద్రా ప్రశ్నించారు. ప్రధాని మౌనంగా ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోందని అన్నారు. తన సొంత పార్టీ నాయకులు, కేంద్ర మంత్రి, ఆయన కుమారుడు లఖింపూర్ ఖేరి అల్లర్ల వెనుక ఉందనే విషయం తెలిసినందు వల్లే ఆయన ఏమీ మాట్లాడలేకపోతున్నారంటూ ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. నలుగురు రైతుల మరణానికి కారణమైన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా, ఆయన కుమారుడు ఆశీష్ మిశ్రా, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యను తక్షణమే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తోన్నారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications