Wife: అక్రమ సంబంధాలు, అడ్డుపడిన భార్య, శాడిస్టు భర్త, భార్యను చంపేసి ఊరి మధ్యలో వేలాడదీసి, జంప్!
లక్నో/బీహార్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు. కొడుకు వయసుకు వస్తున్న సమయంలో దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భర్త అనేక మంది మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. భర్త అక్రమ సంబంధాల విషయం అతని భార్యకు తెలిసిపోయింది. అమాయకురాలైన భార్య నువ్వు పద్దతి మార్చుకోవాలని భర్తకు చాలాకాలం నుంచి నచ్చచెబుతూ వస్తోంది.
అయితే భర్త రెచ్చిపోయి ఇంకా బయట ఎక్కువగా మహిళలతో తిరిగి ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు. చివరికి ఇంట్లో గొడవలు ఎక్కువ అయ్యాయి. తన అక్రమ సంబంధాలకు తన భార్య అడ్డుపడుతోందని రగిలిపోయిన భర్త అతని భార్యను చంపేసి ఊరి మద్యలో ఉన్న విద్యుత్ స్థంభానికి ఆమె శవం వేలాడదీయడం కలకలం రేపింది.

మొదట్లో సంతోషంగానే ఉన్నాడు
బీహార్ లోని సమస్తిపూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న రాకేష్ యాదవ్ (పేరు మార్చడం జరిగింది) అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం ఉమాదేవి అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న రాకేష్ యాదవ్, ఉమాదేవి దంపతులు కొన్ని సంవత్సరాలు చాలా సంతోషంగా కాపురం చేశారు. రాకేష్ యాదవ్, ఉమాదేవి దంపతులకు ఓ కొడుకు ఉన్నాడు.

భర్తకు అక్రమ సంబంధాలు
కొడుకు వయసుకు వస్తున్న సమయంలో రాకేష్ యాదవ్, ఉమాదేవి దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. అనేక మంది మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్న రాకేష్ యాదవ్ పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడు. భర్త రాకేష్ యాదవ్ అక్రమ సంబంధాల విషయం అతని భార్య ఉమాదేవికి తెలిసిపోయింది.

భార్యను టార్చర్ పెట్టాడు
అమాయకురాలైన ఉమాదేవి నువ్వు పద్దతి మార్చుకోవాలని, నువ్వు ఇలా తిరిగితే మన కుటుంబం పరువుపోతుందని ఆమె భర్తకు చాలాకాలం నుంచి మంచిమాటలతో నచ్చచెబుతూ వస్తోంది. అయితే భార్య ఉమాదేవి మాటలు పట్టించుకోని రాకేష్ యాదవ్ పరాయిస్త్రీల వ్యామోహంతో ఇంట్లో అతని భార్యను టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు.

భార్యను గొంతు నులిమి చంపేసిన భర్త
ఉమాదేవి అమాయకత్వం అలసుగా తీసుకున్న ఆమె భర్త ఇంకారెచ్చిపోయి ఎక్కువగా మహిళలతో తిరిగి ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు. చివరికి ఇంట్లో గొడవలు ఎక్కువ అయ్యాయి. తన అక్రమ సంబంధాలకు తన భార్య ఉమాదేవి అడ్డుపడుతోందని రగిలిపోయిన భర్త అతని భార్యను గొంతు నులిమి చంపేశాడు.

భార్య శవం ఊర్లో వేలాడదీసి ఎస్కేప్
ఊరి మద్యలో రుపౌలి హైస్కూల్ సమీపంలోని సైదాపూర్ జాహిద్ గ్రామంలో విద్యుత్ స్థంభానికి ఉమాదేవిశవం వేలాడదీసిన ఆమె భర్త ఎస్కేప్ కావడం కలకలం రేపింది. తన తండ్రికి అక్రమ సంబంధాలు ఉన్నాయని, ఆ విషయం ప్రశ్నించిన తన తల్లి ఉమాదేవిని తన తండ్రి హత్య చేశాడని అతని కొడుకు పోలీసులకు సాక్షం చెప్పాడు. అక్రమ సంబంధం కారణంగా ఉమాదేవిని ఆమె భర్త దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications