Wife: భార్యను నిద్రలేపి పిలుచుకుని వెళ్లాడు. ఎక్స్ ప్రెస్ రైలుకింద తోసేసి చంపేసిన శాడిస్టు భర్త, సీసీటీవీల్లో
ముంబాయి/ పాల్గార్: వివాహం చేసుకున్న దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి భర్త రైల్వేస్టేషన్ కు వెళ్లారు. మద్యాహ్నం నుంచి రాత్రి వరకు నలుగురు రైల్వేస్టేషన్ లోనే ఉన్నారు. తరువాత భర్త అతని భార్య, పిల్లలకు తినడానికి ఆహారం తీసుకుని వెళ్లి ఇచ్చాడు. భోజనం చేసిన భార్య, పిల్లలు రైల్వేస్టేషన్ లోనే నిద్రపోయారు. వేకువ జామున భార్యను మాత్రం నిద్రలేపిన భర్త ఆమెతో పాటు రైల్వే ఫ్లాట్ ఫామ్ సమీపంలో నడుచుకుని వెలుతున్నాడు. ఆ సందర్బంలో వేగంగా వచ్చిన ఎక్స్ ప్రెస్ రైలు కిందకు భార్యను బలవంతంగా తోసేయడంతో ఆమె ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. భార్యను హత్య చేసిన తరువాత ఇద్దరు పిల్లలను పిలుచుకుని రైల్వేస్టేషన్ నుంచి పారిపోయాడు. భర్త అతని భార్యను ఒక్కసారిగా రైలు కిందకు తోసేయడం, అంతకు ముందు జరిగిన తతంగం మొత్తం రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడం, ఆ క్లిప్సింగ్స్ బయటకు రావడంతో వైరల్ అయ్యాయి.

రైల్వేస్టేషన్ కు వెళ్లిన దంపతులు
మహారాష్ట్రలోని పాల్గార్ జిల్లాలోని వసాయ్ రోడ్డు రైల్వేస్టేష్ లోకి 30 ఏళ్ల వ్యక్తి అతని భార్య, 2 సంవత్సరాలు, ఐదు సంవత్సరాల వయసు ఉన్న ఇద్దరు కుమారులతో కలిసి వెళ్లాడు. మద్యాహ్నం నుంచి రాత్రి వరకు దంపతులు, వారి ఇద్దరు పిల్లలు అదే రైల్వేస్టేషన్ లోనే ఉన్నారు. మద్యాహ్నం నుంచి రాత్రి 8 గంటల వరకు భర్త ఆ రైల్వేస్టేష్ లో అటూఇటూ తిరిగాడు.

నిద్రపోతున్న భార్యను పిలుచుకుని వెళ్లాడు
రాత్రి 9 గంటటల సమయంలో భర్త అతని భార్య, పిల్లలకు తినడానికి ఆహారం తీసుకుని వెళ్లి ఇచ్చాడు. భోజనం చేసిన భార్య, పిల్లలు రైల్వేస్టేషన్ లోనే నిద్రపోయారు. వేకువ జామున 4 గంటలకు భార్యను మాత్రం నిద్రలేపిన భర్త ఆమెతో పాటు రైల్వేస్టేషన్ లోని ఫ్లాట్ ఫామ్ నుంబర్ 5లో నడుచుకుని వెళ్లాడు. భార్యతో ఆమె కొంతసేపు ఏదో మాట్లాడాడు.

శాడిస్టు భర్త ఎస్కేప్
వేకువ జామున 4.10 గంటల సమయంలో వేగంగా వచ్చిన అవధ్ ఎక్స్ ప్రెస్ రైలు కిందకు భార్యను బలవంతంగా తోసేయడంతో ఆమె ప్రాణాలు స్పాట్ లో గాలిలో కలిసిపోయాయి. భార్యను హత్య చేసిన తరువాత నిద్రపోతున్న ఇద్దరు పిల్లలను నిద్రలేపాడు. చిన్నబిడ్డను భుజం మీద ఎత్తుకుని, ఐదేళ్ల కొడుకు చెయ్యి పట్టుకుని నడిపించుకుని వసాయ్ రోడ్డు రైల్వేస్టేషన్ నుంచి బయటకు వెళ్లిపోయాడు.

రెండు రైళ్లలో పారిపోయిన నిందితుడు
వసాయ్ రోడ్డు రైల్వేస్టేషన్ నుంచి బయటకు వెళ్లిపోయాన భర్త తరువాత కల్యాణ్ కు వెళ్లే రైలు ఎక్కి అక్కడికి చేరుకున్నాడని, కల్యాణ్ నుంచి మరో రైలులో ప్రయాణించాడని సీసీటీవీల్లో రికార్డు అయ్యిందని, త్వరలో నిందితుడిని పట్టుకుంటామని రైల్వే పోలీస్ అసిస్టెంట్ కమీషనర్ భాజీరావ్ మహాజన్ స్థానిక మీడియాకు చెప్పాడు.

సీసీటీవీ క్లిప్పింగ్స్ వైరల్
హిందీలో మాట్లాడుకున్న దంపతుల పేర్లు, వివరాలు మాత్రం ఇంకా చిక్కడం లేదని రైల్వే పోలీస్ అసిస్టెంట్ కమీషనర్ భాజీరావ్ మహాజన్ అంటున్నారు. భర్త అతని భార్యను ఒక్కసారిగా రైలు కిందకు తోసేయడం, అంతకు ముందు జరిగిన తతంగం మొత్తం రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడం, ఆ క్లిప్సింగ్స్ బయటకు రావడంతో వైరల్ అయ్యాయి.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications