Wife: భార్యను 300 ముక్కలు చేసిన డాక్టర్, తల టేబుల్ మీద పెట్టి మాట్లాడుతూ ?, కెమికల్స్ తో మేనేజ్ చేసి ?

భువనేశ్వర్/న్యూఢిల్లీ: భర్త ఆర్మీలో డాక్టర్, మంచి అమ్మాయిని చూసిన కుటుంబ సభ్యులు ఆ డాక్టర్ కు వివాహం జరిపించారు. వివాహం చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. కతూరు పెళ్లి చేసుకుని భర్తతో దుబాయ్ లో ఉంటున్నది. కొడుకు పెళ్లి చేసుకుని భార్యతో అమెరికాలో ఉంటున్నాడు. డాక్టర్ దంపతులు మాత్రమే సొంత ఇంటిలో నివాసం ఉంటున్నారు. చాలారోజుల పాటు డాక్టర్ భార్య ఎవ్వరికి ఫోన్ చెయ్యలేదు. అనుమానం వచ్చిన ఆమె బంధువులు డాక్టర్ ఇంటికి వెళ్లారు. అప్పుడు అసలు మ్యాటర్ తెలుసుకుని అందరూ షాక్ అయ్యారు. డాక్టర్ అతని భార్యను హత్య చేసి 300 ముక్కలు చేశాడని, మూడు వారాల పాటు తల మాత్రం టేబుల్ మీద పెట్టి కెమికల్స్ చల్లి ఆ తలతో మాట్లాడుతున్నాడని వెలుగు చూడటం కలకలం రేపింది.

ఆర్మీలో ఉద్యోగం

ఆర్మీలో ఉద్యోగం

ఒడిశా రాజధాని భువనేశ్వర్ లోని నాయపల్లిలో నివాసం ఉంటున్న సోమనాథ్ పరిదా అలియాస్ సోమనాథ్ అనే వ్యక్తి చాలా సంవత్సరాల క్రితం ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. భారత్ ఆర్మీలో సోమనాథ్ డాక్టర్ గా ఉద్యోగంలో చేరాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఉషాశ్రీ అనే మహిళను చూసిన కుటుంబ సభ్యులు డాక్టర్ సోమనాథ్ తో వివాహం జరిపించారు.

 విదేశాల్లో కూతురు, కొడుకు

విదేశాల్లో కూతురు, కొడుకు

వివాహం చేసుకున్న సోమనాథ్, ఉషాశ్రీ దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. సోమనాథ్, ఉషాశ్రీ దంపతులకు కూతురు, కొడుకు ఉన్నారు. కతూరు పెళ్లి చేసుకుని భర్తతో దుబాయ్ లో ఉంటున్నది. కొడుకు పెళ్లి చేసుకుని భార్యతో అమెరికాలో ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం సోమనాథ్ కల్నల్ స్థాయిలో ఆర్మీ నుంచి రిటైడ్ అయ్యారు.

 భార్య మీద అనుమానం ?

భార్య మీద అనుమానం ?


ఆర్మీలో రిటైడ్ అయిన కల్నల్ డాక్టర్ సోమనాథ్ అతని భార్య ఉషాశ్రీతో కలిసి భువనేశ్వర్ లోని నాయపల్లి ప్రాంతంలోని సొంత ఇంటిలో కాపురం చేసేవాళ్లు. భార్య ఉషాశ్రీ మీద డాక్టర్ సోమనాథ్ కు అనుమానం మొదలైయ్యింది. ఇదే విషయంలో సోమనాథ్, ఉషాశ్రీ దంపతుల మద్య గొడవలు ఎక్కువ అయ్యాయి, ఇంట్లో ఎవ్వరూ లేకపోవడంతో సోమనాథ్ అతని భార్య ఉషాశ్రీతో ఇంకా ఎక్కువ గొడవపడేవాడు.

భార్యను 300 ముక్కలు చేసేసిన డాక్టర్

భార్యను 300 ముక్కలు చేసేసిన డాక్టర్

2013 జూన్ 3వ తేదీ రాత్రి సోమనాథ్ అతని భార్య ఉషాశ్రీతో గొడవపడ్డాడు. ఆ సందర్బంలో మాటామాటా పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన డాక్టర్ సోమనాథ్ స్టీల్ టార్చర్ తో అతని భార్య తల మీద కొట్టి చంపేశాడు. డాక్టర్ కావడంతో సోమనాథ్ పదునైన ఆయుధాలు ఉపయోగించి అతని భార్య ఉషాశ్రీ శవాన్ని 300 ముక్కలు చేశాడు.

తల టేబుల్ మీద పెట్టి 18 రోజులు మాట్లాడిన శాడిస్టు డాక్టర్

తల టేబుల్ మీద పెట్టి 18 రోజులు మాట్లాడిన శాడిస్టు డాక్టర్

భార్య ఉషాశ్రీ శవాన్ని 300 ముక్కలు చేసిన తరువాత ఆ ముక్కలు 20 స్టీల్ టిఫిన్ బాక్స్ ల్లో, రెండు ట్రంక్ పెట్టలో, పాలిథిన్ కవర్లలో భద్రపరిచి దుర్వాసన రాకుండా కెమికల్స్, ఫినాయిల్ పోశాడు. ఉషాశ్రీ తల మాత్రం కెమికల్స్ లో అద్ది ఆ తల టేబుల్ మీద పెట్టి 18 రోజుల పాటు మాట్లాడుతూ వచ్చాడు. ఇంటి నుంచి దుర్వాసన రాకుండా ఉషాశ్రీ శవం ముక్కలు చేసిన అవయావాల మీద రసాయనాలు చల్లిన డాక్టర్ సోమనాథ్ ఏమీ తెలీనట్లు బయట నటించాడు. 20 రోజుల పాటు భార్య ఉషాశ్రీ శరీంలోని ముక్కలు అతని ఇంట్లోనే పెట్టుకున్నాడు. చివరికి ఉషాశ్రీ తలలోని వెంట్రుకలు, చర్మాం రాలిపోవడంతో పుర్రె మాత్రం మిగిలింది.

కూతురికి అనుమానం వచ్చింది

కూతురికి అనుమానం వచ్చింది


18 రోజుల నుంచి దుబాయ్ లో ఉన్న కూతురు ఫోన్ చేసినా ఉషాశ్రీ రిసీవ్ చెయ్యకపోవడం, తిరిగి ఫోన్ చెయ్యకపోవడంతో ఆమెకు అనుమానం వచ్చి అమెరికాలో ఉన్న సోదరుడికి చెప్పింది. అమెరికాలో ఉన్న ఉషాశ్రీ కొడుకు ఆమె బంధువులకు ఫోన్ చేసి ఇంటికి వెళ్లి చూడాలని చెప్పారు. ఉషాశ్రీ సొంత సోదరుడు రంజన్ సమన్, అతని బంధువులు డాక్టర్ సోమనాథ్ ఇంటికి వెళ్లి తలుపులు తియ్యాలని చెప్పారు.

 పోలీసుల ఎంట్రీతో షాక్

పోలీసుల ఎంట్రీతో షాక్

బంధువులు వెళ్లి అడిగితే ఉషాశ్రీ దుబాయ్ లోని కూతురి ఇంటికి వెళ్లిందని చెప్పి తలుపులు మాత్రం తియ్యలేదు. బంధువులు కిటీలు తీసి చూడగా దుర్వారస రావడంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. లోపల ట్రంక్ పెట్టలో, టిఫిన్ బాక్స్ ల్లో ఉషాశ్రీ శవం ముక్కలు గమనించిన పోలీసులు బిత్తరపోయారు.

యావజ్జీవ కారాగార శిక్ష

యావజ్జీవ కారాగార శిక్ష

మొదట డాక్టర్ సోమనాథ్ తన భార్య ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు చెప్పాడు. తరువాత సోమనాథ్ అతని భార్య ఉషాశ్రీని హత్య చేసి ఆమె శవాన్ని 300 ముక్కలు చేశానని అంగీకరించాడు. పోలీసులు బలమైన సాక్షాలు కోర్టులో సమర్పించారు. 2020 ఫిబ్రవరి నెలలో డాక్టర్ సోమనాథ్ కు భువనేశ్వర్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. 50 వేలు జరిమానా విధించింది. ఢిల్లీలో ప్రియుడు హఫ్తాబ్ అతని ప్రియురాలు శ్రద్దాను హత్య చేసి ఆమె శవాన్ని 35 ముక్కలు చేసిన తరువాత గతంలో జరిగిన ఇలాంటి కేసుల వివరాలు రోజుకు ఒకటి బయటకు వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+