Wife: బావకు ఫోన్ చేసి పిలిపించిన భర్త, ఇంట్లో శవమైన భార్య, ఏమో మాకేం తెలుసు ?, బ్యాంకు ఉద్యోగి !
చెన్నై/తిరువణ్ణామలై: మంచి ఉద్యోగం చేస్తున్న యువకుడికి మా అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తే జీవితాంతం సుఖంగా ఉంటుందని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు. అనుకున్నట్లే పెళ్లి గ్రాండ్ గా చేశారు. భర్తతో సంతోషంగా కాపురం చేసిన భార్య కవల పిల్లలకు జన్మనిచ్చింది. దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న భర్త ఉదయం బయటకు వెళ్లి రాత్రి ఇంటికి చేరుకుంటున్నాడు. ఇటీవల భార్య సోదరుడికి ఫోన్ చేసిన భర్త వెంటనే మా ఇంటికి రావాలని చెప్పాడు. సోదరుడు వెళ్లి చూడగా భర్త ఇంటిలో అతని చెల్లెలు శవమై కనిపించింది. ఏం జరిగింది అని మహిళ అన్న ప్రశ్నిస్తే నీ చెల్లెలు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని సింపుల్ గా చెప్పారు. అసలు మ్యాటర్ చెప్పకుండా అంత్యక్రియలు ఇక్కడ చేద్దామా ?, బయట చేద్దామా ? అంటూ భర్త, అతని కుటుంబ సభ్యులు తాపీగా చెప్పడంతో భార్య అన్న, ఆమె తల్లి హడలిపోయి పోలీసులను ఆశ్రయించారు.

బ్యాంకులో ఉద్యోగం
తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలోని అరణిలో పార్తీబన్ ( అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అగ్రపాళ్యంలో నివాసం ఉంటున్న షర్మిల (24) అనే యువతిని పార్తీబన్ కు ఇచ్చి వివాహం చెయ్యాలని పెద్దలు మాట్లాడుకున్నారు. పార్తీబన్ ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రైవేట్ బ్యాంకులో మంచి ఉద్యోగం చేస్తున్న పార్తీబన్ కు షర్మిలను ఇచ్చి వివాహం చేస్తే జీవితాంతం సుఖంగా ఉంటుందని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు.

కవల పిల్లలు
నాలుగు సంవత్సరాల క్రితం పార్తీబన్, షర్మిల దంపతుల వివాహం గ్రాండ్ గా చేశారు. వివాహం చేసుకున్న తరువాత పార్తీబన్ అరణిలో అతని భార్య షర్మిలతో కలిసి కాపురం పెట్టాడు. దంపతులకు కవలల పిల్లలు పుట్టారు. కొడుకు పేరు లింగేశ్వరన్ (2), కూతురి పేరు లితీషా (2) అని నామకరణం చేశారు. పార్తీబన్, షర్మిల దంపతులు సంతోషంగా ఉన్నారని ఆమె కుటుంబ సభ్యులు అనుకున్నారు.

బావకు ఫోన్ చేసి పిలిపించాడు..... ఇంట్లో శవమై కనిపించింది
సంవత్సరం నుంచి పార్తీబన్, షర్మిల దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న పార్తీబన్ ప్రతిరోజూ ఉదయం బయటకు వెళ్లి రాత్రి ఇంటికి చేరుకుంటున్నాడు. భార్య షర్మిల సోదరుడు చార్లెస్ కు ఫోన్ చేసిన పార్తీబన్ నువ్వు వెంటనే మా ఇంటికి రావాలని చెప్పాడు. చార్లెస్, అతని తల్లి రాణి శుకుంతల ఆందోళనతో వెంటనే పార్తీబన్ ఇంటికి వెళ్లి చూడగా షర్మిల శవమై కనిపించింది.

ఆత్మహత్య చేసుకుందని సింపుల్ గా చెప్పిన భర్త
షర్మిలను శవంగా చూసిన ఆమె కుటుంబ సభ్యులు ఆర్తనాదాలు చేశారు. ఏం జరిగింది అని షర్మిల అన్న చార్లెస్ అతని బావ పార్తీబన్ ను ప్రశ్నించాడు. నీ చెల్లెలు షర్మిల ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని పార్తీబన్ సింపుల్ గా చెప్పాడు. ఎందుకు ఆత్మహత్య చేసుకుందని చార్లెస్, అతని తల్లి రాణి శకుంతల ప్రశ్నిస్తే ఏమో మాకేం తెలుసు అంటూ అసలు మ్యాటర్ చెప్పకుండా నిర్లక్షం చేశారని తెలిసింది.
Recommended Video

అంత్యక్రియులు ఎక్కడ చేద్దాము ?
అంత్యక్రియలు ఇక్కడ చేద్దామా ?, బయట చేద్దామా ? అంటూ భర్త పార్తీబన్, అతని కుటుంబ సభ్యులు తాపీగా అడగడంతో చార్లెస్, అతని తల్లి రాణి శకుంతల హడలిపోయి పోలీసులను ఆశ్రయించారు. షర్మిలను హత్య చేసి దానిని ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని, పార్తీబన్ తో పాటు అతని కుటుంబ సభ్యులను అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేస్తూ షర్మిల కుటుంబ సభ్యులు అరణి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications