Wife: భార్య మీద పగ, చేతికి మట్టిఅంటకుండా భర్త ఏం చేశాడంటే ?, జ్యూస్ అని యాసిడ్ తాగించి ?
గ్వాలియర్/చెన్నై: భార్య మీద కోపంతో రగిలిపోతున్న భర్త ఆమెను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. తన చేతికి మట్టి అట్టకుండా భార్యను చంపేస్తే సేఫ్ గా ఉంటామని, లేదంటే పోలీసు కేసులతో లేనిపోని సమస్యలు వస్తాయని భర్త ఆలోచించాడు. భార్యతో బలవంతంగా యాసిడ్ తాగించిన పాపాత్ముడు ఆమెను హత్య చెయ్యడానికి ప్రయత్నించి విఫలం అయ్యాడు. యాసిడ్ తాగడంతో శరీరంలోని అవయవాలు కాలిపోయిన మహిళ ఆసుపత్రిలో చావుబతుల మద్య మృత్యువుతో పోరాడుతోంది.
భార్య మీద పగ
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో సూరజ్, సలోని (ఇద్దరి పేర్లు మార్చడం జరిగింది) దంపతులు నివాసం ఉంటున్నారు. భార్య సలోని మీద అనుమానం పెంచుకున్న ఆమె భర్త సూరజ్ భార్యను చంపేయాలని డిసైడ్ అయ్యాడు. ప్రతినిత్యం భార్య సలోనితో గొడవ పడుతున్న భర్త సూరజ్ ఆమెను చితకబాది చిత్రహింసలకు గురి చేస్తున్నాడని తెలిసింది.
భార్యతోనే యాసిడ్ తాగించేశాడు
భార్య చనిపోయిన తరువాత తాను హ్యాపీగా బయట తిరగాలని సూరజ్ ఆలోచించాడు. తన చేతికి మట్టి అంటకుండా భార్య సలోనిని చంపేస్తే సేఫ్ గా ఉంటామని, లేదంటే పోలీసు కేసులతో లేనిపోని సమస్యలు వస్తాయని భర్త సూరజ్ ఆలోచించాడు. భార్య సలోనితో బలవంతంగా యాసిడ్ తాగించిన సూరజ్ ఆమెను హత్య చెయ్యడానికి ప్రయత్నించాడు.
మృత్యువుతో పోరాడుతున్న భార్య
యాసిడ్ తాగడంతో సలోని శరీరంలోని అవయవాలు కాలిపోయాయి. ఆసుపత్రిలో సలోని చావుబతుల మద్య మృత్యువుతో పోరాడుతోంది. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ పోలీసులు భర్త మీద కేసు నమోదు చేశారు. గ్వాలియర్ సబ్ డివిజన్ మేజిస్ట్రేట్ ఆసుపత్రి చేరుకుని బాధితురాలిని విచారించి ఆమె స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్నారు.

తప్పించుకున్న భర్త
భార్యతో ఆమె భర్త బలవంతంగా యాసిడ్ తాగించాడనే విషయం తెలుసుకున్న ఢిల్లీ మహిళా కమీషన్ చైర్మన్ స్వాతి మాలివాల్ ఆసుపత్రి చేరుకుని బాధితురాలిని పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. భార్యతో యాసిడ్ తాగించిన నిందితుడిని ఇంత వరకు అరెస్టు చెయ్యలేదని, మధ్యప్రదేశ్ పోలీసులు అతని మీద కేసు మాత్రమే నమోదు చేశారని విచారణం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. మహిళతో ఆమె భర్త బలవంతంగా యాసిడ్ తాగించాడని వెలుగు చూడటంతో దేశవ్యాప్తంగా మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications