Wife: గాలికి తిరుగుతున్న భర్త, బయట కష్టపడి డబ్బు సంపాధిస్తున్న భార్య, బేస్ బాల్ బ్యాట్ తో కొట్టి !

లూధియానా/ చెన్నై: పెళ్లి సమయంలో అమ్మాయి కుటుంబ సభ్యులు పెళ్లి కొడుక్కి వారి స్థోమతను బట్టి కట్నకానుకలు ఇచ్చుకున్నారు. 12 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న దంపతులు ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. భార్యతో సంతోషంగా కాపురం చేస్తున్న భర్త కొంతకాలం కష్టపడి పని చేశాడు. మద్యం, డ్రగ్స్ కు బానిస అయిన భర్త తరువాత కుటుంబాన్ని పట్టించుకోవడంలో నిర్లక్షం చేస్తూ వచ్చాడు. ఇదే సమయంలో భార్య బయటకు వెళ్లి డబ్బులు సంపాధించడం మొదలు పెట్టింది. ఇదే విషయంలో దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. రానురాను దంపతల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి. ఓ రోజు భార్య తల్లికి ఫోన్ చేసిన భర్త మీ కూతురు మేడ మీద బట్టలు ఉతుకుతూ కిందపడిపోయిందని, తీవ్రగాయాలైనాయని చెప్పాడు. మహిళను ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే చనిపోయింది. పోస్టుమార్టం నివేధికలో మహిళను బేస్ బాల్ బ్యాట్ తో కొట్టి, రుమాలుతో గొంతు కోసి చంపేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది.

12 ఏళ్ల క్రితం పెళ్లి

12 ఏళ్ల క్రితం పెళ్లి

పంజాబ్ లోని లూధియానాలో హైబోవల్ లోని ఆనంద్ నగర్, 22వ స్ట్రీట్ లో వికాంత్ అలియాస్ విక్కీ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. లూధియానాలోనే నివాసం ఉంటున్న మనీషా అలియాస్ సిమ్రాన్ అనే యువతి నివాసం ఉంటున్నది. 12 సంవత్సరాల క్రితం సిమ్రాన్, విక్కీల వివాహం జరిగింది.

 కట్నకానుకలు ఇచ్చిన అమ్మాయి కుటుంబ సభ్యులు

కట్నకానుకలు ఇచ్చిన అమ్మాయి కుటుంబ సభ్యులు


పెళ్లి సమయంలో సిమ్రాన్ కుటుంబ సభ్యులు పెళ్లి కొడుకు విక్కీకి వారి స్థోమతను బట్టి కట్నకానుకలు ఇచ్చుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న విక్కీ, సిమ్రాన్ దంపతులు 10 ఏళ్ల కుమార్తె, ఐదు సంవత్సరాల వయసు ఉన్న కొడుకు ఉన్నారు. ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయిన సిమ్రాన్, విక్కీ చాలా సంతోషంగా ఉన్నారు. భార్య సిమ్రాన్ తో సంతోషంగా కాపురం చేసిన విక్కీ కొన్ని సంవత్సరాలు కుక్ గా, డ్రైవర్ గా రెండు పనులు చేస్తూ కష్టపడి పని చేశాడు.

భర్త చెడుతిరుగుడు..... పని చేస్తున్న భార్య

భర్త చెడుతిరుగుడు..... పని చేస్తున్న భార్య

మద్యం, డ్రగ్స్ కు బానిస అయిన విక్కీ తరువాత అతని భార్య విక్కీతో పాటు అతని బిడ్డలను పట్టించుకోవడంలో నిర్లక్షం చేస్తూ వచ్చాడు. ఇదే సమయంలో విక్కీ భార్య సిమ్రాన్ బయటకు వెళ్లి పనులు చేస్తూ డబ్బులు సంపాధించడం మొదలు పెట్టింది. ఇదే విషయంలో విక్కీ, సిమ్రాన్ దంపతుల మధ్య గొడవలు మొదలైనాయి. రానురాను సిమ్రాన్, విక్కీ దంపతల మధ్య గొడవలు ఎక్కువ అయ్యాయి.

అత్తకు ఫోన్ చేసి ఏం చెప్పాడంటే ?

అత్తకు ఫోన్ చేసి ఏం చెప్పాడంటే ?

జనవరి 8వ తేదీన విక్కీ అతని భార్య సిమ్రాన్ తల్లి శశికి ఫోన్ చేసి మీ కూతురు మేడ మీద బట్టలు ఉతుకుతూ కిందపడిపోయిందని, తీవ్రగాయాలైనాయని చెప్పాడు. శశి, ఆమె కొడుకులు కరణ్, గౌరవ్, ఆమె కుటుంబ సభ్యులు సిమ్రాన్ ఇంటికి చేరుకుని చూశారు. అప్పటికే సిమ్రాన్ మంచం మీద చలనం లేకుండా పడిఉంది. వెంటనే సిమ్రాన్ ను ఆసుపత్రికి తరలించారు.

Recommended Video

    India's Greatest Spy Ravindra Kaushik Incredible Story
     బేస్ బాల్ బ్యాట్ తో కొట్టి, గొంతు కోసి చంపేసిన భర్త

    బేస్ బాల్ బ్యాట్ తో కొట్టి, గొంతు కోసి చంపేసిన భర్త

    అయితే అప్పటికే సిమ్రాన్ చనిపోయిందని వైద్యులు చెప్పారు. సిమ్రాన్ ను ఆమె భర్త విక్కీ కొట్టి గొంతు కోసి చంపేశాడని ఆమె తల్లి శశి, కరణ్ కేసు పెట్టారని లూధియానా డిప్యూటీ పోలీసు కమీషనర్ అశ్వినీ గోత్వాల్ స్థానిక మీడియాకు చెప్పారు. పోస్టుమార్టం నివేధికలో సిమ్రాన్ ను బేస్ బాల్ బ్యాట్ తో కొట్టి, రుమాలుతో గొంతు కోసి చంపేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది. సిమ్రాన్ కుటుంబ సభ్యులు కేసు పెట్టిన తరువాత విక్కీ ఆసుపత్రి నుంచి పరారైనాడు. భార్య సిమ్రాన్ ను హత్య చేసి తప్పించుకున్న విక్కీని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని డిప్యూటీ పోలీసు కమీషనర్ అశ్వినీ గోత్వాల్ మీడియాకు చెప్పారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+