Wife: పుట్టింటిలో భార్య మీద పెట్రోల్ పోసి ?, భర్త అసలు మ్యాటరే వేరే ఉంది, అత్తారింటిలో అరాచకం !

కొచ్చి/కాసరగూడు: వివాహం చేసుకున్న తరువాత భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వేరే మహిళతో ఎంజాయ్ చేస్తున్న భర్త ఆమె వ్యామోహంలో భార్యను టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడు. ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న భర్త సక్రమంగా ఇంటికి రావడం మానేశాడు. సక్రమంగా ఎందుకు ఇంటికి రావడం లేదని భార్య ప్రశ్నిప్తే ఆమెను పట్టుకుని చితకబాదుతున్నాడు. నీకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని భార్యను వేధింపులకు గురి చేశాడు. అదనపుకట్నం కావాలని భార్యను డిమాండ్ చేశాడు. భర్త టార్చర్ తట్టుకోలేక అతని మీద భార్య కేసు పెట్టింది. తన మీద భార్య కేసు పెట్టి తన సంతోషాలకు అడ్డుపడుతుందని రగిలిపోయిన భర్త పుట్టింటిలో ఉన్న భార్య మీద పెట్రోల్ పోసి నిప్పంటించడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.

 హ్యాపీలైఫ్ అని ఊహించుకున్న భార్య

హ్యాపీలైఫ్ అని ఊహించుకున్న భార్య

కేరళలోని కాసరగూడు (కర్ణాటక సరిహద్దు)లోని మంజేశ్వర ప్రాంతంలో హబీబ్ (26) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. రెండు సంవత్సరాల క్రితం రజియా బేగం (పేరు మార్చడం జరిగింది) అనే యువతితో హబీబ్ వివాహం జరిగింది. హబీబ్ ను వివాహం చేసుకున్న రజియా బేగం తాను జీవితాంతం అతనితో సుఖంగా ఉండాలని అనుకుంది.

 వివాహిత మహిళతో భర్తకు లింక్

వివాహిత మహిళతో భర్తకు లింక్

రజియా బేగంను వివాహం చేసుకోక ముందునుంచి హబీబ్ కు ఓ వివాహిత మహిళతో అక్రమ సంబంధం ఉందని సమాచారం. రజియా బేగంను పెళ్లి చేసుకున్న తరువాత కూడా హబీబ్ ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వేరే మహిళతో ఎంజాయ్ చేస్తున్న హబీబ్ ఆమె వ్యామోహంలో భార్య రజియా బేగంను టార్చర్ పెట్టడం మొదలు పెట్టాడు.

 ప్రశ్నించిన భార్య.... చితకబాదిన మొగుడు

ప్రశ్నించిన భార్య.... చితకబాదిన మొగుడు

ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న హబీబ్ సక్రమంగా ఇంటికి రావడం మానేశాడు. సక్రమంగా ఎందుకు ఇంటికి రావడం లేదని రజియా బేగం ప్రశ్నిప్తే హబీబ్ ఆమెను పట్టుకుని చితకబాదుతున్నాడు. నీకు వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని హబీబ్ అతని భార్య రజియా బేగంను వేధింపులకు గురి చేశాడు. అదనపుకట్నం కావాలని భార్య రిజియా బేగంను హబీబ్ డిమాండ్ చేశాడు.

 కేసు పెట్టి పుట్టింటికి వెళ్లిపోయిన భార్య

కేసు పెట్టి పుట్టింటికి వెళ్లిపోయిన భార్య

భర్త హబీబ్ టార్చర్ తట్టుకోలేక అతని మీద భార్య రజియా బేగం వరకట్నం వేధింపుల కేసు పెట్టింది. భర్త హబీబ్ మీద కేసు పెట్టిన తరువాత రజియా బేగం మొగ్రాల్ పుత్తూరులోని పుట్టింటికి వెళ్లిపోయింది. తన మీద భార్య రజియా బేగం కేసు పెట్టి తన సంతోషాలకు అడ్డుపడుతుందని హబీబ్ రగిలిపోయాడు.

అత్తారింటిలో భర్త అరాచకం

అత్తారింటిలో భర్త అరాచకం

పుట్టింటిలో నివాసం ఉంటున్న రజియా బేగం భర్త హబీబ్ కు ఫోన్ కూడా చెయ్యడం లేదని తెలిసింది. తన మీద కేసు పెట్టి పుట్టింటిలో హ్యాపీగా ఉన్న తన భార్య రజియా బేగం ఆమె ప్రియుడితో ఎంజాయ్ చేస్తోందని హబీబ్ అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయంలో రగిలిపోయిన హబీబ్ భార్య రజియా బేగం పుట్టింటికి వెళ్లి ఆమె మీద పెట్రోల్ పోసి నిప్పంటించి ఆమెను చంపడానికి ప్రయత్నించాడు

 శాడిస్టు మొగుడు అరెస్టు

శాడిస్టు మొగుడు అరెస్టు

రజియా బేగం కుటుంబ సభ్యులు హబీబ్ ను పక్కకుతోసేసి రజియా బేగంను రక్షించారు. అక్కడి నుంచి పరారైన హబీబ్ ను పోలీసులు వెంటాడి పట్టుకుని బెండ్ తీసి జైలుకు పంపించారు. పుట్టింటిలో ఉన్న భార్య మీద భర్త పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేయడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+