Wife: నా భార్యను రేప్ చేసి చంపేశారని కేసు పెట్టిన భర్త, షాకింగ్ మ్యాటర్ లీక్, బ్యాంకు అకౌంట్ లో !
బెంగళూరు/కలబురిగి: వివాహం చేసుకున్న దంపతులు కాపురం చేస్తున్నారు. దంపతులు కష్టపడి వ్యవసాయం చేస్తున్నారు. చాలాకాలం నుంచి వ్యవసాయంలో సంపాధిస్తున్న డబ్బును భర్త విలాసాల కోసం తగలేస్తున్నాడని సమాచారం. గత ఏడాది నుంచి వ్యవసాయం చెయ్యడంతో వస్తున్న లాభాలను భార్య ఆమె బ్యాంకు అకౌంట్ లో వేసుకుంటున్నది. ఏడాది నుంచి చెరుకు పంట వేస్తున్న దంపతులు వాటిని విక్రయిస్తున్నారు. ఇటీవల ఇంట్లో ఉన్న భార్య దారుణ హత్యకు గురైయ్యింది. నా భార్య ఇంట్లో ఒంటరిగా ఉంటే ఎవరో ఆమె మీద అత్యాచారం చేసి చంపేశారని భర్తతో పాటు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు. మహిళ శరీరం మీద గాయాలు ఉండటం, ఆమె శరీరం మీద బట్టలు మొత్తం చింపేశారని, ఆమె తల మీద దాడి చేసి కత్తితో పొడిచి చంపేశారని పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. మహిళను చంపింది ఎవరు ? అనే అసలు స్కెచ్ గురించి తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.

వ్యవసాయం చేస్తున్న దంపతులు
కర్ణాటకలోని కలబురిగి జిల్లాలోని అఫలజపుర తాలుకాలోని బందారవాడ గ్రామంలో బసవరాజ్ అలియాస్ బసవ, శ్యామలా (33) అనే దంపతులు నివాసం ఉంటున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్న బసవరాజ్, శ్యామలా దంపతులు కాపురం చేస్తున్నారు. బసవరాజ్, శ్యామలా దంపతులు కష్టపడి వ్యవసాయం చేస్తున్నారు.

భార్య అకౌంట్ లో డబ్బులు
చాలాకాలం నుంచి వ్యవసాయంలో సంపాధిస్తున్న డబ్బును బసవరాజ్ అతని విలాసాల కోసం తగలేస్తున్నాడని సమాచారం. గత ఏడాది నుంచి వ్యవసాయం చెయ్యడంతో వస్తున్న లాభాలను బసవరాజ్ భార్య శ్యామలా ఆమె బ్యాంకు అకౌంట్ లో వేసుకుంటున్నది. ఏడాది నుంచి చెరుకు పంట వేస్తున్న బసవరాజ్, శ్యామలా దంపతులు చెరుకు పంటను షుగర్ ఫ్యాక్టరీకి విక్రయిస్తున్నారు.

భార్య దారుణ హత్య
మార్చి 4వ తేదీన బసవరాజ్ బయటకు వెళ్లాడు. ఆ సమయంలో బసవరాజ్ భార్య శ్యామలా మాత్రమే ఇంట్లో ఉంది. మార్చి 4వ తేదీన ఇంట్లో ఉన్న శ్యామలా దారుణ హత్యకు గురైయ్యింది. తన భార్య శ్యామలా ఇంట్లో ఒంటరిగా ఉంటే ఎవరో ఆమె మీద అత్యాచారం చేసి చంపేశారని ఆమె భర్త బసవరాజ్ తో పాటు అతని కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వివరాలు సేకరించారు.

రేప్ అండ్ మర్డర్ కేసు పెట్టిన భర్త
శ్యామలా శరీరం మీద గాయాలు ఉన్నాయని, ఆమె శరీరం మీద బట్టలు మొత్తం చింపేశారని, ఆమె తల మీద దాడి చేసి కత్తితో పొడిచి చంపేశారని పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో శ్యామలా హత్య కేసులో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. శ్యామలాను చంపింది ఎవరు ? అనే అసలు స్కెచ్ గురించి తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.

మొగుడే కంత్రి
పోలీసులు బసవరాజ్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఇటీవల చెరుకు పంట విక్రయించగా భారీ మొత్తలో డబ్బులు మొత్తం బసవరాజ్ భార్య శ్యామలా అకౌంట్ లో వచ్చిపడిందని పోలీసులు గుర్తించారు. చెరుకు పంట విక్రయించగా వచ్చిన డబ్బులో తనకు అర్దం డబ్బులు ఇవ్వాలని బసవరాజ్ భార్య శ్యామలాను అడిగాడని, డబ్బులు ఇవ్వడానికి శ్యామలా నిరాకరించిందని పోలీసులు గుర్తించారు.
Recommended Video

భర్త కాలాంతకుడు
డబ్బులు ఇవ్వడానికి నిరాకరించిన శ్యామలాను ఆమె భర్త బసవరాజ్ హత్య చేశాడని, కేసు నుంచి తప్పించుకోవడానికి ఆమె జాకెట్, చీర చింపేశాడని, అత్యాచారం జరిగిందని అందరిని నమ్మించడానికి ప్రయత్నించాడని పోలీసులు అన్నారు, శ్యామలా శరీరం మీద గాయాలు ఉండటం, ఆమె శరీరం మీద బట్టలు మొత్తం చింపేసి ఉండటంతో మొదట అత్యాచారం చేసి తరువాత చంపేశారని పోలీసులు అనుమానించారు. అయితే పోలీసుల విచారణలో బసవరాజ్ అతని భార్య శ్యామలాను చంపేసి నాటకాలు ఆడాడని వెలుగు చూడటం కలకలం రేపింది. భార్య శ్యామలాను హత్య చేసిన బసవరాజ్ ను పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications