ప్రియుడి కోసం సాంబార్ లో విషం కలిపి భర్తను పరలోకాలకి పంపించిన పతివ్రత!
సమాజంలో రోజు రోజుకి మహిళల్లో క్రూరత్వం పెరిగిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. భర్తలను భార్యలు హత మారుస్తున్న తీరు సభ్య సమాజం నివ్వెరబోయేలా చేస్తుంది. ఎక్కడ చూసినా వివాహేతర సంబంధాలతో భర్తలను భార్యలు హతమారుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒకరు కూల్ డ్రింక్ లో విషమిచ్చి భర్తను చంపితే, మరొకరు మందు తాగించి గొంతు మీద కాలేసి తొక్కి భర్తను హతమారుస్తూ ఉన్నారు.
భర్తని హతమార్చిన భార్య
ఇంకొకరు నిద్ర మాత్రలు వేసి భర్తను పైలోకానికి పంపిస్తున్నారు. ఇక తాజాగా సాంబార్లో విషం కలిపి భర్త ప్రాణం తీసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.తమిళనాడులోని ధర్మపురి జిల్లా అరూర్ సమీపంలోని కీరైపట్టి గ్రామంలో వెలుగు చూసిన దారుణ సంఘటన విషయానికి వస్తే భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసింది ఓ భార్య.

వివాహేతర సంబంధం పెట్టుకున్న భార్య,రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త
పోలీసుల విచారణలో తేలిన వివరాల ప్రకారం.. డ్రైవర్ గా పనిచేసే రసూల్, భార్య అమ్ముబీ ఇద్దరు పిల్లలతో కలిసి జీవనం సాగిస్తున్నారు. ఆమె లోకేశ్వరన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. భార్య ప్రవర్తనలో మార్పుతో రసూల్ తరచూ అమ్ముబీతో గొడవ పడుతుండేవాడు. అదే గ్రామంలో సెలూన్ షాప్ నడుపుతున్న లోకేశ్వరన్‌తో అమ్ముబీ కలుసుకోవడాన్ని రసూల్ గమనించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.
దానిమ్మ రసంలో విషం కలిపి.. ఆపై సాంబార్ లో విషం కలిపి
వారి వివాహేతర బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి రసూల్‌ను హత్య చేయాలని పథకం పన్నింది భార్య. మొదట దానిమ్మ రసంలో పురుగుల మందు కలిపింది. రసూల్ తాగడానికి నిరాకరించడంతో ఆ తర్వాత సాంబార్‌లో కలిపి అతనికి ఇచ్చింది. విషం కలిపిన సాంబార్ తిన్న రసూల్ తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు.రసూల్ మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ప్రియుడితో వాట్సప్ వాయిస్ మెసేజ్ లతో దొరికిన క్రిమినల్ భార్య
పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో వాట్సాప్ వాయిస్ మెసేజ్‌లలో భార్య చేసిన నిర్వాకం బయటపడింది. ప్రియుడితో వాట్స్అప్ వాయిస్ మెసేజ్ ల లో మాట్లాడిన మృతుడి భార్య"నువ్వు ఇచ్చిన విషాన్ని మొదట దానిమ్మ రసంలో కలిపాను. అతను తాగకపోవడంతో తర్వాత సాంబార్‌లో కలిపాను, చచ్చాడు" అని అమ్ముబీ తన ప్రియుడితో చెప్పినట్లుగా ఆ వాయిస్ మెసేజ్‌లలో ఉంది. దీంతో పోలీసులు ఆధారాలు సేకరించి లోకేశ్వరన్, అమ్ముబీ ఇద్దరినీ అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications