ప్రియుడి కోసం భర్తను చపాతితో చంపేసిన భార్య, కన్నింగ్ లేడీ స్కెచ్ !
బెంగళూరు/చిక్కమగళూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా ఉన్నారు. రెండు సంవత్సరాలు భర్తతో సంతోషంగా కాపురం చేసిన భార్య తరువాత ప్రియుడిని సెట్ చేసుకుని అతనితో ఎంజాయ్ చేసింది. భర్తకు మ్యాటర్ తెలిసి భార్యకు బెండ్ తీశాడు. ప్రియుడితో ఎంజాయ్ చెయ్యడానికి భర్త అడ్డుపడుతున్నాడని ఊగిపోయిన భార్య చపాతి స్కెచ్ తో ఆమె భర్తను పక్కాప్లాన్ తో చంపేసింది.
ప్రేమికుడిని చేరదీసుకుని అతనితో జీవితాంతం సంతోషంగా గడపాలని అనుకున్న భార్య ఆమె భర్తను హత్య చేసిన ఘటన కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకాలోని యాగటి సమీపంలోని హనుమనహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది.
నవీన్ (28) అనే యువకుడు అతని భార్య చేతిలోనే హత్యకు గురైనాడు. ఆరేళ్ల క్రితం నవీన్ అనే యుకుడితో పావనికి వివాహమైంది.

నవీన్, పావని దంపతులకు 4 ఏళ్ల కుమార్తె ఉంది. పెళ్లయిన తర్వాత రెండు సంవత్సరాలు భార్యాభర్తలు సంతోషంగా ఉన్నారు. తరువాత నవీన్, పావనిల మధ్య తరచూ గొడవలు జరిగేవి. గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులు జోక్యం చేసుకుని నవీన్, పావనిల మధ్య పంచాయతీలు కూడా చేశారు. అయితే అప్పటికే కిరణ్ అనే యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకున్న పావని అతనితో ఎంజాయ్ చేస్తూ కాలం గడిపింది.
ప్రేమికుడితో కలిసి వెళ్లేందుకు అంగీకరించని పావని ఆమె భర్తను చంపేయాలని అనుకుంది. నీ భర్తను చంపేస్తే మనం జీవితాంతం కలిసి ఉందామని కిరణ్ అతని ప్రియురాలు పావనికి చెప్పాడు. కొంతకాలంగా నవీన్ హత్యకు అతని భార్య పావని, ఆమె ప్రియుడు కిరణ్ స్కెచ్ వేస్తూనే ఉన్నారు. చివరికి కిలాడీ భార్య పావని ఆమె భర్త నవీన్ హత్యకు పవర్ ఫుల్ స్కెచ్ వేసింది.
చపాతీ చేయడానికి ఉపయోగించే నీళ్లలో నిద్రమాత్రను కలిపిన పావని ఆ నిద్రమాత్రలు పూర్తిగ కరిగిపోయేలా చేసింది. నిద్రమాత్రలు కలిపిన ఆనీళ్లలో చపాతీ పిండిని కలిపి చపాతీ చేసింది. ఆ చపాతీని భర్త నవీన్ తో తినిపించింది. భర్త నవీన్ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ప్రియుడు కిరణ్ తో కలిసి పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలోని ఓ చెరువు వద్దకు తీసుకెళ్లి భర్త నవీన్ ను అందులో విసిరేశారు.

నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడని అందరిని నమ్మించాలని అతని చెప్పులు, మొబైల్ ఫోన్ తో పాటు అతని వస్తువులను చెరువు ఒడ్డున అక్కడక్కడ విసిరేసిన పావని, ఆమె ప్రియుడు కిరణ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆగస్టు 5వ తేదీన శనివారం రాత్రి అపస్మారక స్థితిలో ఉన్న భర్త నవీన్ ను చెరువులో పడేసి హత్య చేసిన పావని సైలెంట్ గా ఉండిపోయింది. ఆదివారం మధ్యాహ్నం నవీన్ మృతదేహం చెరువులో తేలింది.
మా కుమారుడు నవీన్ కు ఎలాంటి అప్పు లేదని, అతనికి ఆర్థిక సమస్యలు లేవని, అతను ఆత్మహత్య చేసుకునే అంతపిరికివాడు కాదని, మాకు అనుమానంగా ఉందని నవీన్ కుటుంబ సభ్యులు పోలీసు కేసు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు నవీన్ మృతదేహానికి కడూరు తాలూకా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించకుండా చిక్కమగళూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం రిపోర్టు రావడంతో ప్రేమికుడు కిరణ్ తో కలిసి తన భర్త నవీన్ ను హత్య చేశానని పావని అంగీకరించిందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications