భర్తకు హ్యాండ్..మరిదికి షేక్ హ్యాండ్.. కట్ చేస్తే ఎంతకు బరితెగించింది..!
వివాహేతర సంబంధం నేపథ్యంలో కట్టుకున్న భార్యను కడతేర్చుతున్న మృగాళ్లు ఓ పక్కన ఉంటే.. మరోవైపు ఇప్పుడు కొత్తగా ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను వారినే కాటికి పంపుతున్నారు కొందరు మహిళలు. ఈ తరహా ఘటనలు ఇటీవల కాలంలో వరుసగా చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ గా మరిదితో ఎఫైర్ పెట్టుకొని కట్టుకున్న వాడిని కిరాతకంగా చంపింది ఓ భార్య. ఈ దారుణ ఘటన ఢిల్లీలో జరగగా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.
అక్రమ సంబంధాల మోజుతో కొందరు మహిళలు దారుణాలకు తెగిస్తున్నారు. దేశ రాజధాని లోని దోహ్రా ప్రాంతంలో జులై 13న జరిగిన ఈ హృదయవిదారక సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్తను చంపేందుకు భార్య తన మరిదితో కలిసి పన్నిన దుర్మార్గపు కుట్ర ప్రస్తుతం చర్చనీయాంశమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

స్థానిక ప్రాంతంలో సుష్మిత అనే మహిళ తన భర్త కరణ్ దేవ్ తో కలిసి నివసిస్తోంది. గత కొన్ని నెలలుగా తన భర్త సోదరుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తోంది. చివరికి తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తనే చంపాలనే నిర్ణయించుకున్నారు. అందుకోసం ఇద్దరూ కలిసి భర్తను హత్య చేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు. ప్లాన్ ప్రకారం, జూలై 12 రాత్రి భోజనంలో మత్తు మాత్రలు కలిపి కరణ్‌కు ఇచ్చారు. అతను స్పృహ తప్పిన తర్వాత, విద్యుత్ షాక్ ఇచ్చి హత్య చేశారు.
అయితే హత్య విషయాన్ని కప్పిపుచ్చడానికి చనిపోయిన భర్తను ఆసుపత్రికి తీసుకెళ్లి.. విద్యుత్ షాక్ అయిందని చెప్పారు. కానీ మృతదేహంపై ఉన్న గాయాలు, పరిస్థితిని బట్టి పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. తమ శైలిలో దర్యాప్తు చేయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సుష్మిత, ఆమె మరిది ఇద్దరూ హత్యకు ముందుగా గూగుల్‌లో "Sleeping pills how long to work" వంటి ప్రశ్నలు టైప్ చేసినట్లు గుర్తించారు. అలానే వారి ఫోన్ చాట్ ఆధారంగా ఈ కేసును చేధించారు.
పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో సుష్మిత, తన భర్త తరచూ శారీరకంగా, మానసికంగా వేధించేవాడని, డబ్బు కోసం కొట్టేవాడని తెలిపింది. దీంతో మానసికంగా విసిగిపోయి హత్యకు పాల్పడినట్లు చెప్పింది. అయితే విచారణలో ఆమె చేసిన అభియోగాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications