భర్తను హతం చేసి ఏం చెప్పిందంటే!, ప్రియుడితో కలిసే ప్లాన్.. రాత్రికి రాత్రే
సింగారం గొంతుపై గాయాలు ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోస్టుమార్టం నిమిత్తం బాడీని స్థానిక ఆసుపత్రికి తరలించి.. అతని భార్యను విచారించారు.
అన్నానగర్: ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చిన ఘటన తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో చోటు చేసుకుంది. భర్తతో తలెత్తిన చిన్న వాగ్వాదం చినికి చినికి గాలివానగా మారడంతో.. తీవ్ర ఆగ్రహావేశానికి లోనైన భార్య, ప్రియుడి సహకారంతో రాత్రికి రాత్రే అతన్ని హత్య చేసింది.
వివరాల్లోకి వెళ్తే.. విల్లుపురం జిల్లా కక్కనూర్ కు చెందిన సింగారం(38) స్థానికంగా ఉన్న ఒక హోటల్లో పరోటా మాస్టర్ గా పనిచేస్తున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన సత్య(30)తో పదేళ్ల క్రితం సింగారం వివాహం జరిగింది. వీరిద్దరికి నితీష(4) కుమార్తె కూడా ఉంది.

ఇదే క్రమంలో రోజు లాగే సోమవారం పని ముగించుకుని ఇంటికి వచ్చిన సింగారం సత్యతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగ్గా.. కాసేపటికి సింగారం నిద్రలోకి జారుకున్నాడు. ఏమైందో ఏమో తెలియదు గానీ తెల్లారి లేచేసరికి సింగారం శవమై కనిపించాడు. విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని భార్య చెప్పింది.
అయితే సింగారం గొంతుపై గాయాలు ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. పోస్టుమార్టం నిమిత్తం బాడీని స్థానిక ఆసుపత్రికి తరలించి.. అతని భార్యను విచారించారు. దీంతో ప్రియుడితో కలిసి తానే సింగారంను హత్య చేసినట్లు సత్య ఒప్పుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications