
Wife: అయ్యప్ప మాల వేసుకుని భార్యను నరికి చంపేసిన భర్త, అనుమానం, ఇంటికి తాళం వేసి ఎస్కేప్ !
కాసరగూడు/కొచ్చి/మంగళూరు: వివాహం చేసుకున్న భర్త అతని భార్యతో సంతోషంగా జీవిస్తున్నాడు. భర్తకు దైవభక్తి ఎక్కువ. భర్త అతని పని అతను చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. అయితే భార్య మీద అతనికి అనుమానం ఉందని చుట్టుపక్కల వాళ్లు అంటున్నారు. అయ్యప్ప మాల వేసుకున్న భర్త ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం అదే ఊరిలోని భజన మందిరానికి వెళ్లి అయ్యప్ప భజన చేస్తున్నాడు. ఉదయం అతను భజన మందిరానికి రాకపోవడంతో అతని స్నేహితుడు ఇంటికి వెళ్లి చూశాడు. ఇంట్లో స్నేహితుడి భార్య దారుణ హత్యకు గురై రక్తపు మడుపుమడుగులో పడి ఉన్న విషయం గుర్తించిన అతను కేకలు వేశాడు. చట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగడంతో అప్పటికే జిల్లా హెడ్ క్వాటర్స్ కు చేరుకున్న భర్త రైలులో అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దంపతుల హ్యాపీలైఫ్
కేరళలోని కాసరగూడు జిల్లా (కర్ణాటక సరిహద్దు జిల్లా)లోని డెడడ్కాలోని పెర్లాడా డౌన్ టౌన్ లోని రెసిడెన్షియల్ క్వాటర్స్ లో అశోక్ (40) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఉషా (35) అనే మహిళను అశోక్ వివాహం చేసుకున్నాడు. ఉషాను వివాహం చేసుకున్న అశోక్ అతని భార్యతో సంతోషంగా జీవిస్తున్నాడు.

భర్తకు దైవభక్తి ఎక్కువ
అశోక్ కు దైవభక్తి చాలా ఎక్కువ అని సమాచారం. ప్రతినిత్యం పూజలు చేస్తున్న అశోక్ అందరిలాగా అతని భార్య ఉషాతో కలిసి సంతోషంగా జీవించేవాడు. చుట్టుపక్కల వారి గురించి ఎక్కువగా పట్టించుకోని అశోక్ అతని పని అతను చేసుకుంటూ కాలం గడుపుతున్నాడని సమాచారం.

అయ్యప్ప మాల వేసుకున్న భర్త
ఇటీవల అశోక్ అయ్యప్ప మాల వేసుకున్నాడు. అయ్యప్ప మాల వేసుకున్న అశోక్ ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం అదే ఊరిలోని భజన మందిరానికి వెళ్లి సాటి అయ్యప్ప భక్తులతో కలిసి అయ్యప్ప భజన చేస్తున్నాడు. ఉదయం అశోక్ భజన మందిరానికి రాకపోవడంతో అతని స్నేహితుడు ఇంటికి వెళ్లి చూశాడు. ఇంటి బయట తాళం వేసి ఉండటం, ఇంట్లో అశోక్ భార్య ఉషా దారుణ హత్యకు గురై రక్తపు మడుపుమడుగులో పడి ఉన్న విషయం గుర్తించిన అతను భయంతో గట్టిగా కేకలు వేశాడు.

రైల్వే స్టేషన్ లో భర్త అరెస్టు
ఉషా హత్యకు గురైన విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి ఉషా శవాన్ని ఆసుపత్రికి తరలించారు. ఉషా హత్యకు గురి కావడం, ఆమె భర్త అశోక్ కనపడకపోవడం, అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అతని కోసం పోలీసులు గాలించారు.

భార్య మీద అనుమానం..... మానసిక పరిస్థితి ?
భార్య ఉషాను చంపేసిన అశోక్ ఇంటి బయట తాళం వేసి అప్పటికే ఆ ఊరి నుంచి చెక్కేశాడు. పోలీసులు రంగంలోకి దిగడంతో అప్పటికే కసరగూడుకు చేరుకున్న అశోక్ రైల్వేస్టేషన్ కు చేరుకుని రైలులో అక్కడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అశోక్ కు అతని భార్య ఉషా మీద అనుమానం ఉండేదని, అంతేకాకుండా అతను కొంతకాలంగా మానసిక ఆరోగ్య సమస్యలో బాధపడుతున్నాడని అతను నివాసం ఉంటున్న ఇంటి చుట్టుపక్కల వాళ్లు చెప్పారని, అశోక్ అతని భార్య ఉషాను ఎందుకు హత్య చేశాడు ? అనే విషయం కచ్చితంగా తెలీదని పోలీసులు అంటున్నారు.